వరదలు బిహార్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. 16 జిల్లాల్లోని.. 1,232 గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. దాదాపు 74 లక్షల మందిని ప్రభావితం చేసింది. 23 మందిని బలిగొంది.
వరద ధాటికి దాదాపు 5.8 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో కేంద్ర, రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. 20 ఎన్ డీఆర్ఎఫ్ దళాలు, 13 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలో దిగాయి. 11,849 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా.. 9.46 లక్షల మందికి ఆహార వసతులు ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో భాగమతి, బుర్హి గడక్, కామలాబాలన్, అధ్వారా, ఖిరోయి, ఘాఘ్రా నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. గంగా నది, ప్రమాద స్థాయికి 17 సెం.మీల ఎత్తున ఉప్పొంగుతోంది. ఇప్పటికే వరద అల్లకల్లోలం సృష్టిస్తోంటే.. బిహార్లో సోమవారం ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది భారత వాతావరణ శాఖ.
ఇదీ చదవండి: మెడలో ప్లకార్డు వేసుకొని.. లొంగుబాటు