ETV Bharat / bharat

బిహార్ బరి: 'నిరుద్యోగి'పైనే అందరి గురి

బిహార్​ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అన్ని కూటములు తమ మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నాయి. అయితే ఈ సారి ఎన్నికల ముంగిట పార్టీలన్నీ.. నిరుద్యోగులు, యువతపై వరాల జల్లు కురిపిస్తున్నాయి. పింఛను పథకాలు, వ్యవసాయ బిల్లుల రద్దు, ఉచిత కరోనా వ్యాక్సిన్​ కంటే ఉద్యోగాల కల్పనే కీలకంగా ప్రచారాల్లో దూసుకెళ్తున్నాయి. ప్రధాన కూటములు/పార్టీల మేనిఫెస్టోలను ఓసారి పరిశీలిద్దాం.

bihar parties manifesto
బిహార్​ ఎన్నికల్లో నిరుద్యోగులదే ఓటుబ్యాంకు..
author img

By

Published : Oct 24, 2020, 6:10 PM IST

కరోనా తర్వాత దేశవ్యాప్తంగా జరుగుతున్న మహాసంగ్రామం బిహార్​ ఎన్నికలు. ఈ సమరంలో యువతను ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి అన్ని పార్టీలు. లాక్​డౌన్​ కాలంలో ఉపాధి కోల్పోయిన లక్షల మంది వలస కూలీలు, యువతను ఆకర్షించేందుకు ఉద్యోగాల కల్పనే ప్రధానాంశమని తమ మేనిఫెస్టోల ద్వారా ప్రకటిస్తున్నాయి. పింఛను​ పథకాలు, వ్యవసాయ బిల్లుల రద్దు, ఉచిత కరోనా వ్యాక్సిన్​ కంటే ఉద్యోగమే కీలక హామీగా ప్రచారాల్లో దూసుకెళ్తున్నాయి.

అధికార కూటమిలో ఉన్న భాజపా రానున్న 5 ఏళ్లలో.. 19 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. అయితే విపక్షాలు మాత్రం ఇన్ని లక్షల ఉద్యోగాలు సాధ్యం కావని ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు ఇచ్చిన వరాల జల్లులు ఏంటో ఓసారి చూద్దాం..

భాజపా మేనిఫెస్టోలోని కీలకాంశాలు..

నితీశ్​ నేతృత్వంలోని జేడీయూ, భాజపా కలిసి ఎన్​డీఏగా బరిలోకి దిగుతున్నాయి. నితీశ్​ మరోసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. భాజపా ఇచ్చిన హామీల్లో ప్రధానమైనవి...

  • బిహార్​ వాసులకు ఉచితంగా కొవిడ్​-19 టీకా
  • 19 లక్షల ఉద్యోగాల కల్పన (10 లక్షల వ్యవసాయ సంబంధిత ఉద్యోగాలు, 5 లక్షల ఐటీ, 3 లక్షల ఉపాధ్యాయ, 1 లక్ష ఆరోగ్య రంగంలో ఉద్యోగాలు)
  • 3 కోట్ల మంది మహిళలకు స్వయం ఉపాధితో చేయూత
  • 9వ తరగతి నుంచి ప్రతి విద్యార్థికి ఉచిత ట్యాబ్లెట్​
  • 2 ఏళ్లలో 15 కొత్త వ్యవసాయ ప్రాసెసింగ్​ పరిశ్రమలు ఏర్పాటు
  • బిహార్​లో ఐటీ హబ్​, పట్నా, రాజ్​గిర్​లో ఐటీ ఇన్​ఫ్రా అభివృద్ధి
  • లక్ష మంది మహిళలకు మైక్రో ఫైనాన్సింగ్​ సదుపాయం
  • రాష్ట్రంలో క్రీడా వర్సిటీ నిర్మాణం
  • డిజిటల్​ కౌన్సిలింగ్​ కేంద్రాల ఏర్పాటు
  • 2024 నుంచి దర్బంగా ఎయిమ్స్​ కార్యకలాపాలు ప్రారంభం
  • గ్రామాలు, పట్టణాల్లో 30 లక్షల మందికి గృహకల్పన
  • వలస కార్మికుడు వేరే రాష్ట్రంలో చనిపోతే బాధిత కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం
  • దేశ సేవలో చనిపోయిన జవాను కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, రూ.25 లక్షల ఆర్థిక సాయం
  • చిరుదాన్యాలకు మద్దతు ధర అమలు
  • ప్రతి గ్రామం, పట్టణాల్లో.. 4జీ, బ్రాడ్​బాండ్​ సేవలు

మహాకూటమి మేనిఫెస్టో కీలకాంశాలు..

ఆర్​జేడీ, కాంగ్రెస్​, సీపీఐ ,సీపీఎం​ కలిసి బిహార్​ ఎన్నికల్లో 'మహాకూటమి'గా బరిలోకి దిగనున్నాయి. తేజస్వీ యాదవ్​ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూటమి ముందుకు సాగుతోంది. మహాకూటమి హామీలు ఇలా ఉన్నాయి...

  • 10 లక్షల ఉద్యోగాల కల్పన
  • నిరుద్యోగులకు నెలకు రూ.1500 భృతి
  • ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీతో పాటు ఆస్పత్రుల నిర్మాణం
  • ప్రతి గ్రామంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు
  • నూతన పరిశ్రమల విధానం అమలు
  • ప్రభుత్వ ఉద్యోగాలకు, ప్రభుత్వ పరీక్షలకు హాజరయ్యే స్థానికులకు ఫీజుల మినహాయింపు
  • పేదలకు, వృద్ధులకు రూ.1000 పింఛను
  • కాంట్రాక్ట్​ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి చేర్చుకోవడం
  • ప్రైవేటీకరణకు స్వస్తి
  • అన్ని నీటిపారుదల పంపులను సౌర పంపులుగా మార్చడం
  • బిహార్​లో క్రీడా విశ్వవిద్యాలయం
  • ప్రతి డివిజన్​లోనూ పెద్ద స్టేడియం
  • ప్రభుత్వ ఉద్యోగులకు ముందస్తు పింఛను వ్యవస్థ
  • ప్రత్యేక ఆర్థిక జోన్ల ఏర్పాటు
  • విద్యుత్​ రేట్లలో కోత
  • రైతు రుణాల మాఫీ
  • ప్రజలకు సహాయం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 'కరుపురి శ్రమ్​ వీర్​ సహాయత' కేంద్రాల ఏర్పాటు.
  • 'స్మార్ట్​ గ్రామ్​ యోజన' కింద ప్రతి పంచాయతీలో.. వైద్యుడు, నర్సుతో కూడిన క్లినిక్ ఏర్పాటు​.
  • కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు తొలి శాసనసభ సమావేశంలోనే బిల్లు.

ఎల్​జేపీ మేనిఫెస్టోలోని కీలకాంశాలు..

బిహారీలకు పెద్ద పీట వేసే విధంగా చిరాగ్ పాసవాన్ నేతృత్వంలోని లోక్​జనశక్తి పార్టీ మేనిఫెస్టో రూపొందించింది. అందులోని ప్రధానాంశాలు...

  • ఉద్యోగార్థులు, యజమానులు నేరుగా సంప్రదించుకునేందుకు ప్రత్యేక వెబ్ పోర్టల్
  • యువజన కమిషన్ ఏర్పాటు
  • గ్రామ పంచాయతీలు, బ్లాకులు, మార్కెట్లలో మహిళలకు ప్రత్యేక శౌచాలయాలు
  • వరదల నివారణకు ప్రత్యేక కెనాళ్లు ఏర్పాటు చేసి నదులను అనుసంధానం చేయడం
  • బిహార్ పాడి పరిశ్రమకు ఊతమిచ్చేందుకు ఆహార తయారీ యూనిట్లను ప్రతి జిల్లాలో ఏర్పాటు
  • పాల పరిశ్రమలకు ఊతంగా డెన్మార్క్​ మోడల్​ అభివృద్ధి

ఆర్​ఎల్​ఎస్​పీ మేనిఫెస్టో కీలకాంశాలు..

రాష్ట్రీయ లోక్​సమతా పార్టీ(ఆర్​ఎల్​ఎస్​పీ) అధ్యక్షుడు ఉపేంద్ర కుశ్వాహా నేతృత్వంలోని పార్టీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో బిహార్​లో అభివృద్ధే ప్రధానంగా ప్రస్తావించారు. 15 ఏళ్ల సమయం పట్టే పనులను 15 నెలలోనే వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఉపాధి కల్పనపైనే దృష్టిసారించనున్నట్లు స్పష్టం చేశారు.

  • బిహార్​ పబ్లిక్​ సర్వీస్​ ద్వారా ప్రతిభావంతులైన ఉపాధ్యాయుల నియామకం. ఇందుకోసం టీచర్​ ఎలిజిబిలిటీ టెస్టు నిర్వహణ.
  • ఆన్​లైన్​ విద్యకు పెద్ద పీట
  • ప్రతి జిల్లాలో చిన్నారులకు ఉచిత విద్య, సదుపాయాలు కల్పించేందుకు రెసిడెన్షియల్​ హాస్టళ్ల అభివృద్ధి
  • బిహార్​లో క్రీడా వర్సిటీ
  • పట్నా పేరును పాటలీపుత్రగా మార్పు

బహుజన్​ సమాజ్​ పార్టీ, జనతాంత్రిక్​ పార్టీ(సోషలిస్ట్​)తో కలిసి కూటమిగా బరిలోకి దిగుతున్నారు కుశ్వాహా. 2015లో 23 స్థానాల్లో పోటీచేయగా.. రెండు స్థానాల్లో ఈ పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అయితే ఈ ముగ్గురూ కుశ్వాహాపై తిరుగుబాటు చేసి నితీశ్​ ఆధ్వర్యంలోని జేడీయూలో కలిశారు.

బిహార్​లోని 243 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్​ 28, నవంబర్​ 3, 7 తేదీల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నవంబర్​ 10న ఫలితాలు వెలువడనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.