ETV Bharat / bharat

బిహార్​ బరి: తొలిరోజు మూడు నామినేషన్లే! - Sushil Modi

బిహార్​ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి విడత ఎన్నికల కోసం.. నామినేషన్ల స్వీకరణ గురువారం మొదలైంది. తొలి రోజు ముగ్గురే.. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్​ దాఖలు చేశారు. అక్టోబర్​ 28న తొలి విడత పోలింగ్​ జరగనుంది.

Bihar Assembly Elections: Nominations for first phase to start today
బిహార్​ బరి: తొలిరోజు ముగ్గురు నామినేషన్​ దాఖలు
author img

By

Published : Oct 2, 2020, 9:51 AM IST

బిహార్​ శాసనసభ తొలి విడత ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలి రోజు.. ముగ్గురు నామపత్రాలు దాఖలు చేశారు. వీరంతా స్వతంత్ర అభ్యర్థులేనని ఈసీ వర్గాలు తెలిపాయి. ఔరంగాబాద్​లో ఇద్దరు, వజీర్​గంజ్​లో ఒకరు నామినేషన్​ వేసినట్లు పేర్కొన్నారు అధికారులు.

ఎన్డీఏ కూటమిలో సీట్ల కేటాయింపుపై స్పష్టత వచ్చిన తర్వాత.. నామినేషన్​ ప్రక్రియ ఊపందుకోనున్నట్లు తెలుస్తోంది.

243 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 3 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడతలో భాగంగా 71 స్థానాలకు అక్టోబర్​ 28 పోలింగ్​ జరగనుంది.

  • నామినేషన్లకు చివరితేదీ - అక్టోబర్​ 8
  • ఉపసంహరణకు గడువు - అక్టోబర్​ 12
  • పోలింగ్​ - అక్టోబర్​ 28

ఇటీవల జేడీయూలో చేరిన బిహార్​ మాజీ డీజీపీ గుప్తేశ్వర్​ పాండే.. తొలి దశ ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బక్సర్​ జిల్లాలోని ఒక స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

రెండో, మూడో విడత ఎన్నికల కోసం అక్టోబర్​ 9, 13 తేదీల్లో నోటిఫికేషన్​ వెలువడనుంది. వరుసగా నవంబర్​ 3, 7 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.

నవంబర్​ 10న ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.

ఇవీ చూడండి:

నితీశ్​ 'పంచరత్నాలు'- ఎన్నికల బాధ్యతలన్నీ వీరిపైనే..

బిహార్​ బరి: అగ్రవర్ణాల ప్రభావమెంత ?

రూ. 74 లక్షలు పట్టివేత..

ఎన్నికల నోటిఫికేషన్​ విడుదలైన తొలిరోజే.. పట్నాలో సాసారామ్​ ప్రాంతానికి చెందిన ఆర్​జేడీ నేత సంజయ్​ సింగ్​ కారులో నుంచి రూ. 74 లక్షలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తనిఖీల సమయంలో.. సంజయ్​ అక్కడ లేరు.

ఈ నేపథ్యంలో.. ఆర్​జేడీ టికెట్లను అమ్ముకుంటోందని విమర్శించారు బిహార్​ ఉపముఖ్యమంత్రి సుశీల్​ కుమార్​ మోదీ. సంజయ్​ సింగ్​ కారులో నగదు పట్టుబడటమే దీనికి సంకేతమని ట్వీట్​ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.