దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. సరిపడా ఉపాధ్యాయులు లేక విద్యా ప్రమాణాలు నానాటికీ క్షీణిస్తున్నాయి.
విద్యార్థులు-ఉపాధ్యాయుల నిష్పత్తిలో దేశంలోనే బిహార్ చివరి స్థానంలో ఉంది. ఇక్కడ 38 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో దేశ రాజధాని దిల్లీ ఉంది. ఇక్కడా అదే పరిస్థితి. 35 మంది విద్యార్థులకు ఒక్కరే గురువు ఉన్నారు. ఉపాధ్యాయుల కొరతపై ఈమేరకు నివేదిక విడుదల చేసింది మానవ వనరుల అభివృద్ధి శాఖ.
విద్యా హక్కు చట్టం-2009 ప్రకారం ప్రాథమిక పాఠశాల్లో 30:1, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 35:1 విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తి ఉండాలి. కానీ బిహార్లో ప్రాథమికోన్నత పాఠశాలల్లో పీఆర్టీ నిష్పత్తి 39:1, దిల్లీలో 34:1గా ఉంది. ప్రాథమిక పాఠశాలల్లో బిహార్లో 38:1, దిల్లీలో 35:1గా ఉంది.
సిక్కింలో చట్టానికి లోబడి పీఆర్టీ నిష్పత్తి ఉంది.
పాఠశాలలపరంగా..
బిహార్ లో 67.94శాతం ప్రాథమిక పాఠశాలలు, 77.86 శాతం మాధ్యమిక పాఠశాలల్లో విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి చాలా దారుణంగా ఉంది. ఆ తర్వాతి స్థానంలో ఝార్ఖండ్ ఉంది. ఇక్కడ 50శాతం ప్రాథమిక పాఠశాలలు, 64శాతం మాధ్యమిక పాఠశాలల్లో పీఆర్టీ నిష్పత్తి ప్రతికూలంగా ఉంది.
దేశవ్యాప్తంగా 26శాతం ప్రాథమిక పాఠశాలలు, 31 శాతం మాధ్యమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది.
ఇదీ చూడండి : 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' రహస్యం చెప్పేసిన మోదీ!