ETV Bharat / bharat

బిహార్​ బీఎస్పీకి షాక్​.. ఆర్జేడీలోకి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు

బిహార్​లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బహుజన్​ సమాజ్​ పార్టీ(బీఎస్పీ)కి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భరత్​ బింద్​.. రాష్ట్రీయ జనతా దళ్​(ఆర్​జేడీ)లో చేరారు. కీలక నేత పార్టీని వీడటం వల్ల ఆర్​ఎల్​ఎస్​పీ నేతృత్వంలోని కూటమిపై ప్రభావం పడనుంది.

Bihar BSP president Bharat Bind quits party and joined in RJD
బిహార్​ బరి: ఆర్​జేడీ తీర్థం పుచ్చుకున్న బీఎస్పీ అధ్యక్షుడు
author img

By

Published : Oct 3, 2020, 5:48 PM IST

బిహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాష్ట్రీయ లోక్​ సమతా పార్టీ(ఆర్​ఎల్​ఎస్​పీ) నేతృత్వంలోని కూటమికి పెద్ద చిక్కొచ్చిపడింది. కూటమిలోని బీఎస్పీ​ రాష్ట్ర అధ్యక్షుడు భరత్​ బింద్.. శనివారం ఆర్జేడీలో చేరారు.

ఆయనకు పార్టీ సభ్యత్వం ఇచ్చారు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్​. సంబంధిత చిత్రాలను ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు. నవ బిహార్​ నిర్మాణంలో భాగంగా ఎన్​డీఏను తరిమికొట్టడానికి.. బింద్​ మద్దతు పలికారని పేర్కొన్నారు తేజస్వీ.

బీఎస్పీ, జనతా పార్టీ(సోషలిస్ట్​)తో కలిసి ఆర్​ఎల్​ఎస్​పీ అధినేత ఉపేంద్ర కుశ్వాహా బిహార్​ ఎన్నికల కోసం కూటమిని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా కుశ్వాహాకు తమ మద్దతు ఉంటుందని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇదివరకే ప్రకటించారు. ఎన్​డీఏ కూటమి, ఆర్జేడీ నేతృత్వంలోని 'మహాఘట్​బంధన్​'లను కాదని ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో.. బింద్​ బీఎస్పీని వీడటం పలు చర్చలకు తావిస్తోంది.

మాయావతి పార్టీలో ఇలాంటి ఆటుపోట్లు కొత్తేం కాదు. 2010లోనూ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయంలో.. ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ పార్టీ మారారు.

ఇదీ చదవండి: 'యూపీలో రామ రాజ్యం కాదు.. ఆటవిక రాజ్యమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.