ETV Bharat / bharat

వరద బాధితుల ఆగ్రహం- ఎంపీపై కుర్చీలతో దాడి - ఎంపీ జనార్ధన్​ సింగ్​పై దాడి

బిహార్​లో వరదల కారణంగా అవస్థలు ఎదర్కొంటున్న బాధితులు... సహాయక చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సివాన్​ జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన భాజపా ఎంపీ జనార్ధన్​ సింగ్ సిగ్రివాల్​పై కుర్చీలతో దాడి చేశారు.

BJP MP attacked by irked flood victims
ఎంపీపై వరదబాదితులపై
author img

By

Published : Aug 10, 2020, 1:53 PM IST

బిహార్​ను వణికిస్తున్న వరదలు.. ప్రజల్లో రాజకీయ నాయకులపై ఆగ్రహానికి కారణమవుతున్నాయి. రాష్ట్రంలో నష్టాన్ని అంచనా వేసేందుకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మహారాజ్​గంజ్​ ఎంపీ జనార్ధన్​ సింగ్ సిగ్రివాల్​కు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

సివాన్​ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పర్యటించి.. లక్రి నాబిగబ్జ్​కు వచ్చిన సిగ్రవాల్​కు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగారు. వారిలో కొంత మంది ఎంపీ సహా ఆయనతో పాటు వచ్చిన అధికారులపైకి కుర్చీలు విసిరారు.

జనాగ్రహం ఎందుకు?

చాలా మంది రాజకీయ నాయకులు తమ ప్రాంతాల్లో పర్యటించినా.. ఎవరూ సహాయం చేయలేదన్నది స్థానికుల ప్రధాన ఆరోపణ. కొంత మంది ఎంపీ సిగ్రివాల్​ను కలిసి పరిస్థితి వివరించినా.. తమకు ఎలాంటి భరోసా ఇవ్వలేదని అంటున్నారు. ఈ కారణంగానే ఎంపీపై దాడికి దిగినట్లు తెలుస్తోంది.

భారీ వరదల కారణంగా బిహార్​లో ఇప్పటి వరకు 23 మంది మృతి చెందారు. 74 లక్షల మందిపై తీవ్ర ప్రభావం పడింది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది.

ఎంపీ జనార్ధన్​పై కుర్చీలతో దాడి

ఇదీ చూడండి:వరద వలలో చిక్కుకున్న 74 లక్షల బతుకులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.