ETV Bharat / bharat

బిహార్​ బరి: సీట్ల సర్దు'బాట'.. ఇట్లాగన్న మాట! - బిహార్ ఎన్నికలు 2020

బిహార్​లో ప్రధాన కూటముల మధ్య సీట్ల సర్దుబాటు విషయంపైనే సర్వత్రా చర్చ నడుస్తోంది. ప్రధాన పార్టీలేవీ అధికారికంగా ప్రకటించనప్పటికీ.. పంపకాలపై ఒక నిర్ణయానికి మాత్రం వచ్చినట్లు సమాచారం. మరి ఏ కూటమి నిర్ణయమేంటో? త్వరలోనే స్పష్టత రానుంది.

Bihar assembly election 2020:
బిహార్​ బరి: సీట్ల సర్దు'బాట'..ఇట్లాగన్న మాట!
author img

By

Published : Oct 3, 2020, 7:50 AM IST

అసెంబ్లీ ఎన్నికల వేళ.. బిహార్​లో ప్రధాన కూటముల మధ్య సీట్ల సర్దుబాటు విషయం ఆసక్తికరంగా మారింది. అటు ఎన్​డీఏలోను, ఇటు మహాకూటమిలోనూ ఇంతవరకు దీనిపై ప్రధాన పార్టీలేవీ అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఒక నిర్ణయానికి మాత్రం వచ్చినట్లు సమాచారం. దీనిపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రావొచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

ఎన్​డీయే 'చెరిసగం' ఫార్ములా

బిహార్​లో మెుత్తం 243 స్థానాలకుగానూ ఎన్​డీయేకు సంబంధించి భాజపా-జేడీయూలు 'చెరిసగం' ఫార్ములాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ముందు 121 స్థానాలు భాజపాకు, 122 సీట్లు జేడీయూకు సర్దుబాటు చేస్తారు. తర్వాత తన కోటాలో భాజపా- కేంద్రమంత్రి రాంవిలాస్ పాసవాన్​కు చెందిన 'లోక్​ జనశక్తి పార్టీ(ఎల్​జేపీ)కి కొన్ని సీట్లు ఇస్తుంది. అలాగే జేడీయూ-జితిన్​రామ్ మాంఝీకి చెందిన 'హెఏఎం' పార్టీకి కొన్ని సీట్లు కేటాయిస్తుంది.

ఎల్​జేపీ నిర్ణయమేంటి?

ఎన్​డీయేలో ఎల్​జేపీ భాగస్వామ్యం ఎలా ఉండబోతోందన్న విషయం ఆసక్తికరంగా మారింది. దీనిపై స్పష్టత ఇచ్చేందుకు ఆ పార్టీ సిద్ధమైంది. ఇందులో భాగంగా తుది నిర్ణయం తీసుకోవడానికి గాను ఆ పార్టీ శనివారం కీలక భేటీ నిర్వహిస్తోంది. కాగా సీట్ల పంపిణీ వ్యవహారం సముచితంగా ముందుకెళ్లడం లేదని, 143 స్థానాల్లో అభ్యర్థులను నిలబెడతామని ఆ పార్టీ సంకేతాలిస్తోంది. దేనిపైనా అధికారికంగా ఏమీ చెప్పనప్పటికీ.. తమకు తక్కువ స్థానాలిస్తే ఎన్​డీయే నుంచి బయకొస్తామని కూడా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు సీట్ల సర్దుబాటులో భాగంగా ఆ పార్టీకి భాజపా 27 స్థానాలు కేటాయించవచ్చని సమాచారం.

మహా కూటమిలో అంగీకారం

ప్రతిపక్ష పార్టీలతో కూడిన మహా కూటమికి సంబంధించి సీట్ల పంపిణీ వ్యవహారం తుదిదశకు చేరుకున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ), కాంగ్రెస్​, వామపక్షాలు దాదాపుగా ఓ అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్​ 63 చోట్ల పోటీకి దిగనున్నట్లు తెలుస్తోంది. వామపక్షాలకు 25 సీట్లు కేటాయించే అవకాశం ఉండగా.. ఆర్జేడీ 145 నుంచి 148 చోట్ల బరిలోకి దిగవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.

కాంగ్రెస్​ భేటీ..

సీట్ల సర్దుబాటుకు సంబంధించి బిహార్​ కాంగ్రెస్ ఇన్​ఛార్జి శక్తిసిన్హ్ గోహిల్​ సహా పలువురు సీనియర్​ నేతలు శుక్రవారం పట్నాలో అంతర్గత సమావేశం నిర్వహించారు. 2015ఎన్నికల్లో కాంగ్రెస్​ విజయం సాధించిన అన్ని స్థానాల్లోనూ ఈసారి పోటీకి దిగాలని నిర్ణయానికొచ్చారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఆర్జేడీకి తెలిపినట్లు కాంగ్రెస్​ వర్గాలు తెలిపాయి. తొలి దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన నేపథ్యంలో.. 2015 ఎన్నికల్లో తాము గెలిచిన స్థానాలకు కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించింది. నిరంకుశంగా వ్యవహరిస్తున్న భాజపాను ఓడించడమే తమ ప్రాధాన్య అంశమని గోహిల్​ చెప్పారు. ఆయన 'ఈటీవీ భారత్​'తో మాట్లాడుతూ సీట్ల సర్దుబాటు వ్యవహారంపై త్వరలోనే ప్రకటన ఉంటుందని వెల్లడించారు.

ప్రత్యామ్నాయం కోసమే 3 పార్టీల కూటమి ఏర్పాటు

బిహార్​ ఎన్నికల్లో ప్రజలకు ఓ సానుకూల ప్రత్యామ్నాయాన్ని అందించేందుకే తాము 3 పార్టీల ఫ్రంట్​(కూటమి)ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్​ఎల్​ఎస్​పీ) అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వహ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కుష్వహ ఓ వార్తా సంస్థతో మాట్లాడారు.

ప్రతిపక్షాల ఓట్లను చీల్చి, ఎన్​డీయేకు ప్రయోజనం చేకూర్చేందుకే ఈ కూటమిని ఏర్పాటు చేసినట్లు వస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ 15 ఏళ్ల 'అధ్వాన పాలన'కు తెర దించాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు.

మరోవైపు ఆర్జేడీ నేతృత్వంలో ముఖ్యమంత్రి పదవికి గట్టి అభ్యర్థి లేరని, అలాగే గతంలో లాలూ పార్టీ 15 ఏళ్ల పాలనను మరిచిపోలేని ప్రజలు ఆ పార్టీవైపు కూడా వెళ్లరని అభిప్రాయపడ్డారు. ఈ రెండూ ఒకే నాణేనికి ఇరువైపులా ఉన్న బొమ్మా బొరుసు లాంటివని ఎద్దేవా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనే తాము కూటమిని ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ఆర్జేడీ ప్రస్తుత నాయకత్వానికి నీతీశ్​ను అధికారం నుంచి దించేంత శక్తి లేదని విమర్శించారు. కాగా ఎల్​జేపీ తన వైఖరి ఏమిటో స్పష్టం చేయలేదని, ఒకవేళ తమతో కలిసి వస్తే బిహార్ ప్రజలకు తాము మరింత మెరుగైన ప్రత్యామ్నాయాన్ని ఇవ్వగలమని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్​ఎల్ఎస్​పీ, మాయవతి నేతృత్వంలోని బీఎస్పీ, జనతాంత్రిక్​ పార్టీ(సోషలిస్ట్)లు ఓ కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా కుష్వహ పేరును మాయావతి ప్రకటించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.