ETV Bharat / bharat

బిహార్ బరి:‌ పోలింగ్​ పూర్తయింది.. ఫలితమే మిగిలుంది - బిహార్ మంత్రి సురేశ్ శర్మ ఓటు

bihar
బిహార్ ఎన్నికలు లైవ్ అప్డేట్
author img

By

Published : Nov 7, 2020, 6:32 AM IST

Updated : Nov 7, 2020, 9:03 PM IST

20:56 November 07

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్ పూర్తికాగా.. శనివారం మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా సమాప్తమైంది. తుది విడత ఎన్నికల్లో సాయంత్రం 5గంటల వరకు 55.22% పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6గంటల సమయానికి క్యూలైన్లలో వేచి ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. దీంతో పోలింగ్‌ శాతం మరింతగా పెరిగే అవకాశం ఉంది. 

బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. అక్టోబర్‌ 28న 71 స్థానాలకు జరిగిన తొలి విడత ఎన్నికల్లో 54.70శాతం పోలింగ్‌ నమోదు కాగా..  నవంబర్‌ 3న 94 స్థానాలకు జరిగిన రెండో విడతలో 55.70% పోలింగ్‌ నమోదైంది. ఆఖరి దశలో 2 కోట్ల మందికి పైగా ఓటర్లు 1,200 మందికి పైగా అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఇప్పటివరకు జరిగిన పోలింగ్‌లో పురారియా నియోజకవర్గంలో అత్యధికంగా 55.50శాతం నమోదైంది. ఈ నెల 10న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.

18:01 November 07

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌లో మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. అక్టోబర్ 28న తొలి దశ, నవంబర్ 3న రెండో దశ, నవంబర్ 7న మూడో దశ పోలింగ్ నిర్వహించారు. తుదిదశ పోలింగ్‌లో సాయంత్రం 5 గంటల వరకు 55.22 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ప్రజలు ఓటింగ్‌లో పాల్గొన్నారు.

తుది విడతలో 19 జిల్లాల్లోని 78 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరిగింది. వాల్మీకీ నగర్‌ లోక్‌సభ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించారు. చివరి విడత ఎన్నికల్లో సుమారు 12 వందల మంది అభ్యర్థులు బరిలో దిగారు. బిహార్‌ స్పీకర్ విజయ్ కుమార్ సహా 12 మంది మంత్రులు, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కుమార్తె సుభాషిణి యాదవ్ ఈ విడత ఎన్నికల్లోనే పోటీపడ్డారు.

పుర్ణియాలో ఓటర్లు ఓట్లు వేయకుండా కొందరు అడ్డుకోగా.. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అరారియాలో జోకియాట్‌ ఆర్జేడీ అభ్యర్థి చొక్కాకు పార్టీ గుర్తు బ్యాడ్జి వేసుకుని ఓటు వేయడానికి వచ్చారు. ఎన్నికల నియామావళిని ఉల్లంఘించినందున ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నవంబర్ 10న వెల్లడించనున్నారు.

17:48 November 07

ఐదుగంటల వరకు..

బిహార్‌లో మూడో దశ శాసనసభ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. శనివారం సాయంత్రం 5గంటల సమాయానికి 54.06 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రకటించింది.

16:30 November 07

3 గంటల వరకు పోలింగ్​ శాతమిదే..

బిహార్​లో తుది దశ ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా జరుగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు దాదాపు 45.85 శాతం పోలింగ్​ నమోదైంది.

15:02 November 07

34.82 శాతం పోలింగ్​​ నమోదు..

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. శనివారం జరుగుతున్న చివరి విడత ఎన్నికల్లో.. 15 జిల్లాల్లోని 78 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట దాదాపు 34.82 శాతం పోలింగ్​ నమోదైంది. పుర్ణియాలో చిన్నపాటి ఘర్షణ తప్ప మిగతా చోట్ల ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగలేదు. ఖతియార్​లోని 12 కేంద్రాల వద్ద ప్రజలు ఓటు వేసేందుకు నిరాకరించారు. తమ ప్రాంతంలోని రెండు రైల్వే క్రాసింగ్​ల వద్ద రక్షణ వంతెనలు నిర్మించలేదని ఓటర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆఖరి విడతలో దాదాపు 2.35 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

13:20 November 07

Locals make a temporary bridge in Muzaffarpur
తాత్కాలిక వంతెన నిర్మించిన గ్రామస్థులు

ఓటర్లు పోలింగ్ స్టేషన్​కు చేరుకునేందుకు వీలుగా బిహార్​ ముజఫర్​పుర్లో​ని స్థానికులు తాత్కాలిక వంతెన నిర్మించారు. కాలువ దాటేందుకు బ్రిడ్జి లేదని, ప్రజలు అధిక  సంఖ్యలో పోలింగ్​లో పాల్గొనేలా చేసేందుకే దీన్ని ఏర్పాటు చేసినట్లు  వారు చెప్పారు.

11:58 November 07

అనారోగ్యంగా ఉన్నా చైతన్యంతో..

బిహార్​ ఎన్నికల్లో భాగంగా ఓ వృద్ధుడు తీవ్ర అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఓటేశారు. కుటుంబ సభ్యులు ఆయనను మంచంపైనే కటిహార్​లోని పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చారు. ఓ చేతికి సెలైన్ ఉన్నప్పటికీ.. ఓటు  హక్కు వినియోగించుకున్నారు.

11:44 November 07

19.74 శాతం

బిహార్ ఎన్నికల మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 19.74 శాతం ఓటింగ్ నమోదైంది. వందల సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు బారులుతీరారు.

11:29 November 07

గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి మృతి:

ఔరాయ్ నియోజకవర్గంలోని కాత్రా ప్రిసైడింగ్ అధికారి గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. సీతామర్హిలోని రిగాలోని బూత్‌లో ఈవీఎంలో లోపం తలెత్తడం వల్ల కొద్దిసేపు ఓటింగ్ నిలిచిపోయింది. అలాగే నర్కాటెయాగంజ్‌, బెతియా కేంద్రాల్లో కూడా ఈవీఎంలలో తలెత్తిన అవాంతరాల వల్ల పోలింగ్ కాస్త ఆలస్యమైంది

10:15 November 07

బిహార్​లో మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం తొమ్మిది గంటల సమయానికి ఓటింగ్ శాతం 7.7గా నమోదైంది.

10:14 November 07

suresh sharma voting
ఓటేసిన మంత్రి సురేశ్ శర్మ

బిహార్ మంత్రి సురేశ్ శర్మ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముజఫర్​పుర్​లోని 94వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. ప్రజలందరూ అభివృద్ధికి ఓటేయాలని కోరారు. ముజఫర్​పుర్ నగరాన్ని సుందరంగా మార్చేందుకు తమ ఓటు హక్కు ఉపయోగించుకోవాలని అన్నారు.

09:30 November 07

  • आज, बिहार में अंतिम चरण का मतदान हो रहा है। सभी मतदाताओं से आग्रह करता हूँ कि कोविड की सावधानियों को ध्यान में रखते हुए बिहार की प्रगति के लिए अधिक से अधिक संख्या में मतदान कर लोकतंत्र के इस पर्व में अपनी भागीदारी अवश्य सुनिश्चित करें।

    — Jagat Prakash Nadda (@JPNadda) November 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బిహార్​ అభివృద్ధికే ప్రజలు ఓటేయాలని కోరారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. పెద్ద ఎత్తున ఓటింగ్​కు తరలిరావాలని అభ్యర్థించారు. కొవిడ్ జాగ్రత్తలను పాటిస్తూ ప్రజాస్వామ్య ఉత్సవంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం​లో తుదివిడత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు ట్వీట్ చేశారు.

09:23 November 07

subhashini raj rao
ఓటేసిన సుభాషినీ రాజ్ రావు

లోక్​తాంత్రిక్ జనతా దళ్ చీఫ్ శరద్ యాదవ్ కుమార్తె, కాంగ్రెస్ నేత సుభాషినీ రాజ్ రావు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మూడో విడత ఎన్నికల్లో భాగంగా మధేపురా నియోజకవర్గంలోని పోలింగ్​ బూత్​లో ఓటేశారు. బిహారీగంజ్​ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున బరిలో ఉన్నారు సుభాషిని.

08:27 November 07

  • Rajya Sabha MP Ahmad Ashfaque Karim casts his vote at a polling station in Katihar.

    He says, "I appeal to people of the State to exercise their right to vote so that deserving candidates are elected." #BiharElections pic.twitter.com/EuabwDj17A

    — ANI (@ANI) November 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పెద్దల సభ సభ్యుడి ఓటు

బిహార్ ఎన్నికల్లో రాజ్యసభ ఎంపీ అహ్మద్ అష్ఫాక్ కరీమ్ ఓటేశారు. కటిహార్​లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలందరూ ఓటేయాలని పిలుపునిచ్చారు. అర్హులైన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

07:48 November 07

bihar polling
ఓటింగ్​లో పాల్గొంటున్న ప్రజలు

బిహార్ దర్భంగాలోని ఓ పోలింగ్ స్టేషన్లో కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఓటింగ్​లో పాల్గొంటున్నారు ప్రజలు.

07:35 November 07

  • बिहार विधानसभा चुनावों में आज तीसरे और आखिरी चरण का मतदान है। सभी मतदाताओं से मेरी विनती है कि वे अधिक से अधिक संख्या में लोकतंत्र के इस पावन पर्व में भागीदार बनें और वोटिंग का नया रिकॉर्ड बनाएं। और हां, मास्क पहनने और सोशल डिस्टेंसिंग का ध्यान भी अवश्य रखें।

    — Narendra Modi (@narendramodi) November 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మోదీ ట్వీట్​..

బిహార్​ మూడో విడత పోలింగ్​లో ప్రజలు భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేయాలని ట్వీట్​ చేశారు. ఓటింగ్​లో సరికొత్త రికార్డు నెలకొల్పాలన్నారు. అయితే మాస్క్​ ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

06:56 November 07

పోలింగ్ షురూ

బిహార్​లో మూడో దశ పోలింగ్​ ప్రారంభమైంది. ఎన్నికలు జరగుతున్న నియోజకవర్గాల్లోని ప్రజలు ఓటేసేందుకు పోలింగ్​ బూత్​లకు క్యూ కట్టారు.

కరోనా మహమ్మారి వ్యాప్తి దృష్టిలో ఉంచుకొని అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాలను ముందస్తుగా శానిటైజ్ చేశారు. ఓటింగ్ ప్రారంభానికి ముందు మాక్ పోలింగ్ నిర్వహించారు.

06:10 November 07

బిహార్​ అసెంబ్లీ తుది దఫా ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. శనివారం (నవంబర్​ 7న) జరగనున్న పోలింగ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఎన్నికల సంఘం. సీమాంచల్​ ప్రాంతంలో తుది విడత ఎన్నికలు జరగనుండగా.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

చివరి విడతలో ఉత్తర బిహార్​లోని 19 జిల్లాల వ్యాప్తంగా ఉన్న 78 స్థానాలకు ఓటింగ్​ జరగనుంది. మొత్తం 2.34 కోట్ల మంది ఓటర్లు.. 1204 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఇందుకోసం 33,500 పోలింగ్​ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసింది ఈసీ.

కీలక వ్యక్తులు..

ఈ ఎన్నికల్లో అసెంబ్లీ స్పీకర్​ విజయ్​ కుమార్​ చౌదరితో పాటు 12 మంది మంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. రాష్ట్ర మంత్రుల్లో బిజేంద్ర ప్రసాద్​ యాదవ్​ (సుపౌల్​), నరేంద్ర నారాయణ్​ యాదవ్​ (అలామ్​నగర్​), మహేశ్వర్​ హజారి (కల్యాణ్​​పుర్​), రమేశ్​ రిషిదేవ్​ (సింఘేశ్వర్​), ఖుర్షీద్​ అలియాస్​ ఫిరోజ్​ అహ్మద్​ (సిక్తా), లక్ష్మేశ్వర్​ రాయ్​ (లౌకహా), బీమా భారతి (రుపాలి) మదన్​ సాహ్ని (బహదుర్​పుర్​) బరిలో ఉన్నారు. మాజీ మంత్రుల్లో భాజపా నుంచి ప్రమోద్​ కుమార్​, సురేశ్​ శర్మ, బినోద్​ నారాయణ్​ ఝా, కృష్ణకుమార్​ రిషి పోటీ చేస్తున్నారు.

వారితో పాటు కేంద్ర మాజీ మంత్రి శరద్​ యాదవ్​ కుమార్తె.. సుభాషిణి యాదవ్​ బిహారీగంజ్​ నుంచి బరిలో నిలిచారు.

లోక్​సభ స్థానానికి ఉపఎన్నిక..

ఈ అసెంబ్లీ ఎన్నికలతో పాటే.. వాల్మీకి నగర్​ లోక్​సభ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. జేడీయూ ఎంపీ వైద్యనాథ్​ మహతో మృతితో ఈ స్థానంలో ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఆయన కుమారుడు సునీల్​ కుమార్​ను బరిలో నిలిపింది జేడీయూ.

ఇప్పటికే అక్టోబర్​ 28న తొలి విడత, నవంబర్​ 3న రెండో విడత పోలింగ్​ ప్రశాంతంగా పూర్తయింది. నవంబర్​ 7న మూడోదఫా ఎన్నికల అనంతరం.. నవంబర్​ 10న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది.

Last Updated : Nov 7, 2020, 9:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.