భారత్‌లో శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణలకు గొప్ప వారసత్వం ఉందని చెప్పారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. నాణ్యమైన యువతను ఆకర్షించడం, కాపాడుకోవడమే శాస్త్రీయ రంగంలో అతిపెద్ద దీర్ఘకాల సవాల్ అని తెలిపారు. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్(2020) ప్రారంభోత్సవానికి ప్రధాని వర్చువల్‌గా హాజరయ్యారు.
శాస్త్రీయ అభ్యాసానికి అత్యంత విశ్వాసవంతమైన దేశంగా భారత్ ఎదగాలని మోదీ ఆకాంక్షించారు. భారత్‌లో ఆవిష్కరణలు, పెట్టుబడులకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎలాంటి సవాల్‌నైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దేశంలో పరిశోధనా వసతులను మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు చేపడుతుందని హామీ ఇచ్చారు.