అయోధ్యలో రామమందిర భూమిపూజ కార్యక్రమానికి సంబంధించి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు స్పష్టతనిచ్చింది. ప్రధాని నరేంద్రమోదీతో సహా 175 మంది ప్రముఖులను భూమిపూజకు ఆహ్వానించినట్లు తెలిపింది.
"ప్రధాని నరేంద్రమోదీ మొదట హనుమాన్‌గడి మందిర్‌ను దర్శిస్తారు. తర్వాత శ్రీ రామ్‌లల్లా వద్ద పూజలు నిర్వహిస్తారు. అనంతరం భూమిపూజ చేస్తారు. భూమిపూజ కోసం 2 వేల తీర్థ స్థలాలు, 100 నదుల నుంచి మట్టిని తీసుకొచ్చాం. శంకరాచార్య, అనేక మంది సాధువులు భూమిపూజ వస్తువులను పంపారు."
- శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు
కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో ఆహ్వానాలు పంపినట్లు వెల్లడించింది ట్రస్ట్. 90 ఏళ్లకు పైబడినవారిని రావటం సరైనది కాదని వివరించింది.
"175 మంది అతిథులను ఆహ్వానించాం. 135 మంది సాధువులు హాజరుకానున్నారు. అయోధ్యకు చెందిన ప్రముఖులను ఆహ్వానించాం. శంకరాచార్య సహా మరికొంతమంది గురువులు చతుర్మాస్ కారణంగా రాలేకపోతున్నామని తెలిపారు."
- శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు
ఇదీ చూడండి: 'అయోధ్య పూర్తయింది- ఇక కాశీ, మథుర కోసం ఉద్యమం'