జమ్ముకశ్మీర్ విలీన దినోత్సవాన్ని నిర్వహించింది స్థానిక భారతీయ జనతా పార్టీ విభాగం. కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసేందుకు మహారాజా హరిసింగ్ 1947, అక్టోబర్ 26న సంతకం చేయడాన్ని పురస్కరించుకుని నిర్వహించినట్లు భాజపా తెలిపింది. పలు ప్రాంతాల్లో త్రివర్ణ పతాకాలతో ర్యాలీలు నిర్వహించింది.
ఈ క్రమంలోనే.. జమ్ముకశ్మీర్ జెండా తమ చేతికి తిరిగి వచ్చే వరకు ఏ జెండాను ఎత్తబోమని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ పేర్కొనటంపై నిరసన వ్యక్తం చేసింది భాజపా. జమ్మూలోని పీడీపీ కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో ర్యాలీగా తరలివచ్చి.. జాతీయ పతాకాన్ని ఎగరేశారు భాజపా కార్యకర్తలు. భారత్ మాతాకీ జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
శ్రీనగర్‌లో ఉద్రిక్తత..
శ్రీనగర్‌లోని క్లాక్ టవర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు భాజపా కార్యకర్తలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత పలువురు భాజపా కార్యకర్తలను అరెస్ట్ చేశారు పోలీసులు.
ఇదీ చూడండి: 'కశ్మీర్ జెండా తిరిగొస్తేనే జాతీయ పతాకానికి జై'