కొవిడ్‌తో పోరాటంలో భాగంగా.. అమెరికాలోని ఫిలడెల్ఫియా ప్రాంతానికి 1.8 మిలియన్ల(18లక్షలు) ఎన్-95 మాస్కులను పంపించింది భారత్. ఈ ప్రాంతం పెన్సిల్వేనియా రాష్ట్రంలోనే అతిపెద్ద నగరమని భారత్ పేర్కొంది. గతంలోనూ.. అగ్రరాజ్యానికి హైడ్రాక్సీ క్లోరోక్వీన్(యాంటీ మలేరియా డ్రగ్)ను సరఫరా చేసిన భారత్.. తాజా చర్యలతో ఇరు దేశాల మధ్య సంత్సంబంధాలను మరింత దృఢపరుచుకుంది.
మేయర్ కోరిక మేరకు
కరోనాపై పోరాటంలో భాగంగా భారత్ తమ ప్రాంతానికి మాస్కులను పంపించాలని ఫిలడెల్ఫియా మేయర్ జిమ్ కిన్నీ కోరారు. ఈ వినతిని భారత్ స్వాగతించి మాస్కులు పంపించింది.
ఒకరికొకరు...
మాస్కుల సరఫరా.. ఆరోగ్య రంగంలో భారత్-అమెరికా మధ్య సంత్సంబంధాలకు నిదర్శనమని అగ్రరాజ్యంలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ ట్వీట్ చేశారు. ఈ నెల 5న భారత్ మాస్కులు సరఫరా చేసిందని పేర్కొన్నారు.
సొంత దేశం కోసమే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేసేంతలా మాస్కులు తయారు చేయడం భారత్ సామర్థ్యాన్ని చాటి చెబుతోందని అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:కరోనాతోనే అంత్యక్రియలకు హాజరైన ఎమ్మెల్యే