ETV Bharat / bharat

మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​కు కొవాగ్జిన్

Covaxin
కొవాగ్జిన్
author img

By

Published : Nov 16, 2020, 5:12 PM IST

Updated : Nov 16, 2020, 5:57 PM IST

17:08 November 16

మూడో దశకు భారత్​ బయోటెక్ టీకా

దిగ్గజ వ్యాక్సిన్‌ తయారీ సంస్థ భారత్ బయోటెక్‌ తమ కరోనా వ్యాక్సిన్‌...  కొవాగ్జిన్ తయారీలో మరో కీలక ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా మూడో విడత క్లినికల్‌ ట్రయల్స్​ను సోమవారం నుంచి ప్రారంభించింది. ఈ మేరకు సంస్థ సీఎమ్​డీ కృష్ణ ఎల్లా ప్రకటించారు.  

26వేల మందిపై..

దేశవ్యాప్తంగా 25 సెంటర్లలో 26 వేల మంది వలంటీర్లకు భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్ ఇస్తున్నారు.‌ మొత్తం 28 రోజుల్లో  6 మైక్రో గ్రాముల ఇంజక్షన్ లు రెండు సార్లు లేక ప్లాసిబో రెండు డోస్ లను వాలంటీర్ల కు ఇవ్వనున్నారు. దేశంలో అత్యధిక మందిపై నిర్వహిస్తున్న మొట్టమొదటి ఫేజ్ 3 ట్రయల్స్ ఇవే కావటం విశేషం.  

మంచి ఫలితాలు..

కొవాగ్జిన్ మొదటి రెండు దశల ప్రయోగాలు మంచి ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో మూడో దశ ట్రయల్స్ చేపట్టినట్టు కృష్ణ ఎల్లా తెలిపారు. ఇప్పటివరకు ఈ టీకా ట్రయల్స్ సంతృప్తికరంగా సాగగా.. తాజా ట్రయల్స్​లో పూర్తి స్థాయిలో పరిశీలించనున్నారు. ఐసీఎంఆర్ భాగస్వామ్యంతో ఈ ట్రయల్స్​ నిర్వహిస్తున్నారు.

మరో టీకా..

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్​బీ) నిర్వహించిన వెబినార్‌లో పాల్గొన్న కృష్ణ ఎల్లా.. కొవిడ్‌ నివారణ కోసం మరో టీకాను సిద్ధం చేసేందుకు భారత్‌ బయోటెక్‌ పనిచేస్తోందని తెలిపారు. ఇది నాసికా చుక్కల రూపంలో ఉంటుందని, వచ్చే ఏడాది నాటికి  ఈ టీకా సిద్ధంగా ఉండే అవకాశం ఉందని వెల్లడించారు.

Last Updated : Nov 16, 2020, 5:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.