ETV Bharat / bharat

బెంగళూరులో విధ్వంసం పక్కా ప్లాన్​తోనే​!

ఆగస్టులో బెంగళూరులో జరిగిన హింసాత్మక ఘర్షణ వెనుక కుట్రకోణం ఉందని ఓ నివేదిక వెల్లడించింది. ఓ వర్గానికి చెందిన వ్యక్తులు.. ముందస్తుగా ప్రణాళిక రచించి అమలు చేశారని 'సిటిజన్స్​ ఫర్​ డెమొక్రసీ' తెలిపింది. ఈ మేరకు నివేదికను కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు అందజేసింది.

Bengaluru riots 'pre-planned': Fact finding report sumbitted to cm yadiyurappa by citizens for democracy
బెంగళూరులో విధ్వంసం పక్కా ప్లాన్​తోనే​..
author img

By

Published : Sep 4, 2020, 7:05 PM IST

బెంగళూరులో ఇటీవలే జరిగిన విధ్వంసానికి.. ముందస్తుగా ప్రణాళిక వేసి పక్కాగా అమలు చేశారని వెల్లడైంది. 'సిటిజన్స్​ ఫర్​ డెమొక్రసీ' ఈ మేరకు ఓ నివేదిక రూపొందించి ముఖ్యమంత్రి బీఎస్​ యాడియూరప్పకు శుక్రవారం అందజేశారు.

'సిటిజెన్స్ ఫర్ డెమొక్రసీ' అనేది ప్రజాస్వామ్య విలువలు, రక్షణ, భద్రతకు సంబంధించిన అంశాలపై జవాబుదారీగా ఉండి ప్రశ్నించేందుకు ఏర్పాటైన వేదిక. 2011లో ప్రారంభమైన ఈ సంస్థ దేశవ్యాప్తంగా సామాజిక ప్రాముఖ్యం ఉన్న అంశాలపై ప్రచారం చేస్తుంది.

ఆగస్టు 11 సాయంత్రం జరిగిన అల్లర్లు.. ఓ వర్గాన్ని లక్ష్యాన్ని చేసుకున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై సామాన్య ప్రజలకు విశ్వాసాన్ని తగ్గించే ఉద్దేశంతో ఈ అల్లర్లను ప్రోత్సహించినట్లు వెల్లడించారు. ఈ విధ్వంసంలో 36 ప్రభుత్వ వాహనాలు, 300 వ్యక్తిగత వాహనాలు, పలు ఇళ్లు ధ్వంసమయ్యాయని తెలిపారు. ఆ నష్టం దాదాపు రూ.10 నుంచి 15 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

ఫేస్​బుక్​లో పోస్ట్​తో...

ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా కర్ణాటకకు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే బంధువు సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టడం వల్ల బెంగళూరు నగరం భగ్గునమండింది. ఆగస్టు 11.. రాత్రి 7 గంటల ప్రాంతంలో మొదలైన అల్లర్లు.. తర్వాత రోజు తెల్లవారుజాము వరకు కొనసాగాయి. 3 వేల మందికిపైగా దుండగులు రెచ్చిపోయి దాడులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి ఇంటితోపాటు డీజే హళ్లి పోలీసు ఠాణాపై నిరసనకారులు దాడి చేశారు. ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఉన్న, ఠాణా ఎదుట ఉన్న వాహనాలకు నిప్పుపెట్టారు. పదుల సంఖ్యంలో వాహనాలు మంటల్లో తగులబడ్డాయి. అల్లరిమూకల రాళ్లదాడిలో ఏసీపీ ఫాతిమా సహా 70 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు లాఠీఛార్జ్‌ చేశారు. బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. అల్లరిమూకలను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు.

పోలీసుల దర్యాప్తులో...

బెంగళూరు అల్లర్ల ఘటనపై పోలీసు ఉన్నతాధికారులూ దర్యాప్తు చేశారు. కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్‌.. బెంగళూరు అల్లర్ల ఘటనపై సీఎం యడియూరప్పకు గతంలో ఓ నివేదిక అందజేశారు. ఈ అల్లర్ల వెనుక సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్​డీపీఐ నేత ముజామ్మిల్ భాషాను ఏ1గా పేర్కొన్న పోలీసులు.. ముందస్తు కుట్రలో భాగంగానే దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. ఆగస్టు 5నుంచి కుట్రకు ప్రణాళిక వేసినట్లు అంచనాకు వచ్చారు. అల్లరిమూకల్లో కొంతమంది గంజాయి తాగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.