వేరు వేరు కాదు
ఎవరి పూజలు వారు చేసుకుంటూ సామరస్యంగా ఉంటారులే అని తేలిగ్గా మాత్రం తీసుకోవద్దు. క్రైస్తవ ఫాదర్లు సైతం మెడలో రుద్రాక్ష మాల, నుదుటన విభూతిని ధరిస్తారు. ఇదేదో ఈ మధ్యకాలంలో ప్రారంభమైన వ్యవహారం కాదండీ బాబూ... 16 శతాబ్దం నుంచి ఈ ఆలయంలో ఇదే తంతు కొనసాగుతోంది.
అందరూ ఆహ్వానితులే...
అన్ని మతాల వారు ఈ ఆలయంలో పూజలు చేస్తుంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఓ ప్రాథమిక పాఠశాల, అనాథ శరణాలయాన్ని సైతం నిర్వహిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడేవారికి ఆయుర్వేద మందుల్ని సైతం అందిస్తున్నారు.
16వ శతాబ్దంలో నిర్మాణం
సెయింట్ జాన్ పింటో అనే క్రైస్తవ ఫాదర్ ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడికొచ్చే క్రైస్తవ ఫాదర్లు హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్ని అనుసరిస్తుంటారు. భారతీయ సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తోందీ ఆలయం.
ఈ ఆలయం నెలకొని ఉన్న దేశనూరు గ్రామ జనాభా ఎంత అనుకుంటున్నారు. 5 వేలు మాత్రమే. గమనించాల్సిన మరో అంశమేమిటంటే గ్రామంలో క్రైస్తవ మతస్థులు ఒక్కరూ లేకపోవడం. కానీ హిందువులు మాత్రం ఇద్దరు దేవుళ్లకు సమాన పూజలు చేస్తారు. నిత్యం మతాల పేరుతో భారతీయులపై విద్వేషాల్ని రెచ్చగొట్టే వారికి.. మార్పు కోసం ఆదర్శంగా నిలుస్తోంది ఈ విఖ్యాత ఆలయం.