ETV Bharat / bharat

పేదలకేదీ పోషకాహారం? భారతీయుల్లో కొరవడిన కండర పుష్టి - Beautiful nutrition that is beautiful for the poor

దేశంలో పౌష్టికాహార సంక్షోభం ఎలా ఇంతలంతలవుతోందో కొన్ని నెలల క్రితమే జాతీయ పోషకాహార అధ్యయన వివరాలు కళ్లకు కట్టాయి. ముప్పై రాష్ట్రాలకు చెందిన సుమారు లక్షా 12 వేలమంది నుంచి రక్త, మూత్ర నమూనాలు సేకరించి వివిధ విటమిన్లు, అయోడిన్‌, జింక్‌, ఫోలేట్‌, ఇనుపధాతు లోపాలపై అప్పట్లో చేపట్టిన భూరి కసరత్తు-భావి పౌరుల ఆరోగ్య చిత్రం ఛిద్రమై, ఎందరో గిడసబారిపోతున్నట్లు నిర్ధరించింది. కొవిడ్‌ మహమ్మారి కోరసాచిన దరిమిలా- అసంఖ్యాకంగా ఉపాధి అవకాశాలు తెగ్గోసుకుపోయి, పోషకాహార లోపాలు మరింత ముమ్మరించాయన్నది యథార్థం.

beautiful-nutrition-that
పేదలకేదీ పోషకాహారం
author img

By

Published : Sep 3, 2020, 8:00 AM IST

దేశంలో పుట్టిన ప్రతి శిశువూ ఆరోగ్యంగా ఎదిగి సమర్థ మానవ వనరుగా రాణించేందుకు విధిగా సమతులాహారం తీసుకోవాలి. ఆ భాగ్యానికి నోచనివారి సంఖ్య పెచ్చరిల్లుతూ స్వస్థ సూచీలు కుంగుతుండటం, అంతర్జాతీయంగా భారత్‌ ప్రతిష్ఠకు తూట్లు పొడుస్తోంది. ‘ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్‌...’ అని నిలదీసిన కవి గళం ‘తిండి కలిగితె కండ కలదోయ్‌...’ అని ఏనాడో స్పష్టీకరించింది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా ‘పోషణ్‌ అభియాన్‌’ పేరిట రెండేళ్ల క్రితం సెప్టెంబరును పోషకాహార మాసంగా నిర్వహించారు. ఈసారీ అదే పద్ధతిలో జరుపుదామని ‘మన్‌కీ బాత్‌’గా ప్రధాని మోదీ ప్రకటించిన నాడే-భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎమ్‌ఆర్‌) సంపూర్ణాహార పట్టికను వెలువరించింది. ప్రతిరోజూ భోజనంలో చిరుధాన్యాలు, పప్పు దినుసులు, పాలు/పెరుగు, కూరగాయలు, కొవ్వు పదార్థాలు తదితరాలకు ఎంతెంత ప్రాధాన్యమివ్వాలో, దేహ బలిమికి అవెంత ఉపయుక్తమో వివరణాత్మకంగా క్రోడీకరించింది. ప్రస్తుత స్థితిగతుల్లో అందుకు నోచుకునేవారెందరు? దేశంలో పౌష్టికాహార సంక్షోభం ఎలా ఇంతలంతలవుతోందో కొన్ని నెలల క్రితమే జాతీయ పోషకాహార అధ్యయన వివరాలు కళ్లకు కట్టాయి. ముప్ఫై రాష్ట్రాలకు చెందిన సుమారు లక్షా 12 వేలమంది నుంచి రక్త, మూత్ర నమూనాలు సేకరించి వివిధ విటమిన్లు, అయోడిన్‌, జింక్‌, ఫోలేట్‌, ఇనుపధాతు లోపాలపై అప్పట్లో చేపట్టిన భూరి కసరత్తు-భావి పౌరుల ఆరోగ్య చిత్రం ఛిద్రమై, ఎందరో గిడసబారిపోతున్నట్లు నిర్ధారించింది. కొవిడ్‌ మహమ్మారి కోరసాచిన దరిమిలా- అసంఖ్యాకంగా ఉపాధి అవకాశాలు తెగ్గోసుకుపోయి, పోషకాహార లోపాలు మరింత ముమ్మరించాయన్నది యథార్థం. ఈ దశలో అందరికీ సమతులాహారం అందడమెంత అత్యావశ్యకమో, ఆ బృహత్తర బాధ్యతను ప్రభుత్వ యంత్రాంగమే చాకచక్యంగా నిభాయించడమూ అంతే కీలకం!

51శాతం మహిళల్లో రక్తహీనత..

ఇండియాలో 51శాతం మహిళలు రక్తహీనతతో, 19కోట్ల పైచిలుకు జనావళి పౌష్టికాహార లేమితో కునారిల్లుతున్నట్లు ఐక్యరాజ్య సమితి గతంలో మదింపు వేసింది. సమతులాహారంపై అశ్రద్ధ వల్ల 70శాతం దాకా భారతీయుల్లో కండర పుష్టి కొరవడుతున్నట్లు అధ్యయనాలు చాటుతున్నాయి. అభివృద్ధి అజెండాలో పౌష్టికాహారానికి విశేష ప్రాధాన్యం దక్కాలని ఆమధ్య ‘నీతి ఆయోగ్‌’ పిలుపివ్వడానికి కారణమిదే. నిజానికి సుమారు ఏడు దశాబ్ధాలుగా రక్తహీనత, పౌష్టికాహార లేమి స్వతంత్ర భారతావనిని జంటగా చెండుకు తింటున్నాయి. కోట్లమందికి రక్షిత జలాలు కరవై పిల్లల్లో అధికులు డయేరియా నులిపురుగుల బారిన పడుతుండటం, 14-49 ఏళ్ల మహిళల్లో రక్తహీనత... పోషకాహార లోపాల విజృంభణకు ముఖ్య కారణాలన్న నీతి ఆయోగ్‌ విశ్లేషణ పరిష్కార సాధనలో పురోగతికి ఉపయోగపడలేదు. ఇప్పుడు కరోనా ధాటికి మరెన్నో కోట్ల బతుకులు అతలాకుతలమవుతున్నాయి. తక్కినవాటితో పోలిస్తే మెరుగ్గా ఉన్న సేద్యరంగం పాలకుల్లో ధీమా ఏర్పరుస్తున్నప్పటికీ- తిండిగింజల్ని కొని వినియోగించలేని దుస్థితిలో కోట్లాది నిరుపేదల జీవితాలు కమిలిపోతున్నాయి. వైరస్‌మాట ఎలాగున్నా, ఆకలి మంటలకు తాళలేకపోతున్నామని కోట్లమంది బావురుమన్న దశలో-జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి రాని వలస శ్రామికులకు నెలవారీ తలా అయిదు కిలోల ఆహారధాన్యాల సరఫరాలకు కేంద్రం మానవీయ చొరవ కనబరచింది. నేడదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రైతులకు ఏమాత్రం నష్టం వాటిల్లకుండా వారికి గిట్టుబాటు ధరలు చెల్లించి సమీకరించిన వ్యవసాయోత్పత్తుల్ని అవసరార్థులకు పకడ్బందీగా పంపిణీ చేయడానికి కేంద్రం కంకణబద్ధం కావాలి. అంగన్‌వాడీ ఆరోగ్య కార్యకర్తల వ్యవస్థను పరిపుష్టీకరించి పోషకాహార పంపిణీని పట్టాలకు ఎక్కించాలి. లేదంటే పోషకాహార లేమిపై సదాశయ ప్రకటనలన్నీ దస్త్రాల్లోనే నీరోడే ముప్పు పొంచి ఉంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.