ETV Bharat / bharat

అదిరే మాస్క్​తో ఫొటో కొట్టు- రూ.5వేలు బహుమతి పట్టు!

కరోనా కట్టడిలో మాస్క్​ల ప్రాధాన్యంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వినూత్న ప్రయత్నం చేశారు కేరళ పోలీసులు. 'బాస్క్​ ఇన్​ ద మాస్క్' పేరిట ఆన్​లైన్​ పోటీ ప్రారంభించారు. చేయాల్సిందల్లా.. కుటుంబమంతా మాస్కులతో ఫొటో దిగి కేరళ పోలీసు విభాగానికి పంపించడమే. మాస్కు డిజైన్​, ఇతర అంశాల ఆధారంగా విజేతల్ని ఎంపిక చేసి, నగదు బహుమతి అందిస్తున్నారు.

Trendsetters in mask designs can win cash prizes
మాస్క్​లపై అవగాహన కోసం 'బాస్క్​ ఇన్​ ది మాస్క్
author img

By

Published : May 5, 2020, 3:41 PM IST

దేశంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా.. మాస్క్​లు ధరించటం తప్పనిసరి అయింది. అవి లేకుండా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. కొన్ని చోట్ల జరిమానాల మోత మోగుతోంది. అయినప్పటికీ.. కొందరు అలసత్వం ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మాస్క్​ల వినియోగంపై అవగాహన కల్పించేందుకు ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు కేరళ పోలీసులు. అదే 'బాస్క్​ ఇన్​ ద మాస్క్​'.

'బాస్క్​ ఇన్​ ద మాస్క్​' భాగంగా 'ఫ్యామిలీ ఫొటో ఛాలెంజ్​'ను తెరపైకి తీసుకొచ్చారు కేరళ పోలీసులు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబసభ్యులందరితో కలిసి ఫొటో దిగాలి. ఆ చిత్రాన్ని.. కేరళ పోలీసు విభాగానికి పంపిస్తే సోషల్ మీడియాల్లో తమ అధికారిక ఖాతాల్లో అప్​లోడ్​ చేస్తారు.

ప్రత్యేక బహుమతులు...

ఫొటోలు పంపేవారు మాస్కులు ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా ఉండేలా చూడాలంటున్నారు పోలీసులు. వేర్వేరు విభాగాల్లో అవార్డులూ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

బెస్ట్​ ఫ్యామిలీ మాస్క్స్​ సెట్​లో భాగంగా రూ.5000, ఆకర్షణీయంగా, సరికొత్తగా మాస్కు డిజైన్​ ఉంటే.. రూ. 3000 నగదు బహుమతిగా అందివ్వనున్నారు.

ఈ పోటీల్లో పాల్గొనేందుకు kpsmc.pol@kerala.gov.in కు ఈ- మెయిల్ గానీ, 94979 00440 నంబరుకు వాట్సాప్​ గానీ చేయాలని సూచించారు.

ఈ ప్రయత్నానికి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే వందలాది కుటుంబాలు తమ తమ చిత్రాలను పంపించాయి. సినీనటులు సహా ఇతర ప్రముఖుల్నీ ఈ ప్రచారంలో భాగస్వాముల్ని చేయాలని చూస్తోంది కేరళ పోలీసు విభాగం. వారితో సరికొత్తగా డిజిటల్​ అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.