ETV Bharat / bharat

అనుమానాలు, ఆశలతో భారత్​కు షేక్​ హసీనా - అనుమానాలు, ఆశలతో భారత్​కు షేక్​ హసీనా

గురువారం నుంచి బంగ్లాదేశ్​ ప్రధాని షేక్​ హసీనా భారత్​లో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ సహా మరికొందరు అగ్రనేతలతో సమావేశంకానున్నారు హసీనా. భారత ఆర్థిక సదస్సులో పాల్గొననున్నారు బంగ్లాదేశ్​ ప్రధాని.

అనుమానాలు, ఆశలతో భారత్​కు షేక్​ హసీనా
author img

By

Published : Oct 2, 2019, 2:23 PM IST

Updated : Oct 2, 2019, 9:19 PM IST

బంగ్లాదేశ్​ ప్రధానమంత్రి షేక్​ హసీనా గురువారం నుంచి నాలుగు రోజులపాటు భారత్​లో పర్యటించనున్నారు. వరుసగా మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన అనంతరం హసీనా భారత్​లో పర్యటించడం ఇదే తొలిసారి.

ప్రపంచ ఆర్థిక సదస్సుకు అనుబంధంగా గురు, శుక్రవారాల్లో జరగనున్న భారత ఆర్థిక సదస్సులో హసీనా ప్రసంగించనున్నారు. ఈ సదస్సుల్లో సింగపూర్​ ఉప ప్రధాని, ఆర్థికమంత్రి హెంగ్​ స్వీ కియట్​, దక్షిణాసియాలోని యూఎన్​ మహిళా రాయబారి, భారత్​ టెన్నిస్​ స్టార్​ క్రీడాకారిణి సానియా మీర్జా సహా ఇతర ముఖ్య అధికారులు పాల్గొనున్నారు.

5న మోదీతో భేటీ...

ఈ నెల 5న భారత ప్రధాని నరేంద్రమోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు హసీనా. మోదీ ప్రధానిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇరు నేతలు భారత్​లో భేటీకావడం ఇదే తొలిసారి కానుంది.

వివిధ ఒప్పందాలతో పాటు ప్రధానులు ఇద్దరు కలిసి మూడు ద్వైపాక్షిక ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రారంభిస్తారని భారత విదేశాంగశాఖ తెలిపింది.

మోదీతో పాటు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, విదేశాంగమంత్రి జయ్​శంకర్​, కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీతో బంగ్లాదేశ్​ ప్రధాని సమావేశం కానున్నారు. తన తండ్రి బంగబంధు షేక్ ముజిబర్ రెహ్మాన్​ బయోపిక్​ నిర్మాణంపై ప్రముఖ దర్శకుడు శ్యామ్​ బెనగల్​తో హసీనా చర్చించనున్నారు.

ఎన్​ఆర్​సీపై ఆందోళన...

ఎన్​ఆర్​సీపై బంగ్లాదేశీయుల్లో అందోళన వ్యక్తమవుతున్న తరుణంలో హసీనా భారత్​ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇటీవల న్యూయార్క్​ ఐరాస సర్వసభ్య సమావేశం సందర్భంగా ఎన్​ఆర్​సీ వ్యవహారం మోదీ, హసీనా మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇరు దేశాల మధ్య ఉన్న సత్సంబంధాల దృష్ట్యా ఆ సమస్యను సులభంగా పరిష్కరించవచ్చని హసీనాకు మోదీ హామీ ఇచ్చినట్టు బంగ్లాదేశ్​ విదేశాంగమంత్రి అబ్దుల్​ మోమెన్​ తెలిపారు. అయితే సమావేశం అనంతరం భారత విదేశాంగశాఖ జారీ చేసి ప్రకటనలో ఎన్​ఆర్​సీ అంశం లేదు.

సమస్య పరిష్కారానికి మోదీ హామీ ఇచ్చారని బంగ్లాదేశే చెబుతున్నా... ఎన్​ఆర్​సీ వ్యవహారం ఆ దేశ పాలకులను కలవరపెడుతోంది. భారత్​లో ఎన్​ఆర్​సీ చుట్టూ నెలకొన్న రాజకీయాలు.., భాజపా,ఆర్​ఎస్​ఎస్​ నేతల వివాదాస్పద వ్యాఖ్యలే ఇందుకు కారణం. బంగ్లాదేశీ వలసదారులను ఉద్దేశించి భారత హోంమంత్రి అమిత్​ షా ప్రయోగించిన పదజాలం ఎంతో అవమానకరంగా ఉందని తమ దేశస్థులు భావిస్తున్నట్టు హసీనా ప్రభుత్వంలోని ఓ అధికారి తెలిపారు.

ఈ విషయంపై ఢాకా కేంద్రంగా పనిచేసే ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ పాలసీ, అడ్వొకసి, గవర్నెన్స్(ఐపీఏజీ) ఛైర్మన్​ స్పందించారు.​

"ఎన్​ఆర్​సీపై భారత్ నుంచి బంగ్లాదేశీయులు స్పష్టమైన ప్రకటన ఆశిస్తున్నారు. అమిత్​ షా వ్యాఖ్యల వల్ల.. ప్రధానికి మోదీ ఇచ్చిన హామీలో విశ్వసనీయత కనిపించడం లేదు."
--​ మునిర్​ ఖాస్రూ, ఐపీఏజీ ఛైర్మన్​.

ఆగస్టు 31న విడుదలైన అసోం ఎన్​ఆర్​సీ వల్ల దాదాపు 19 లక్షల మంది నిరాశ్రయులు కానున్నారు. అయితే ఎన్​ఆర్​సీ భారత అంతర్గత విషయమని బంగ్లాదేశ్​ అంగీకరించింది.

"ఎన్​ఆర్​సీ జాబితాలో లేని వారి పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్​లో జీవించే అవకాశం లభించకపోతే.. వీరిలో అనేక మంది బంగ్లాదేశ్​కు వలస వస్తారని బంగ్లాదేశ్​ భయపడుతోంది. అయితే ఇవన్నీ ఊహాగానాలే. ఎన్నో ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఎన్​ఆర్​సీ ప్రక్రియ ఇంకా అసంపూర్ణంగానే ఉంది. భాజపా, ఆర్​ఎస్​ఎస్​ ప్రకటనలు భయాన్ని పెంచుతున్నాయి."
--- పినాక్​ చక్రవర్తి, భారత మాజీ రాయబారి.

నదీ జలాల పంపకాలపై సందిగ్ధం...

తీస్తా సహా ఇరు దేశాలకు చెందిన 54 నదీజలాల పంపకాలపై ఎన్నో ఏళ్లుగా సందిగ్ధం నెలకొంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఎంత ప్రయత్నించినా ఇప్పటి వరకు ఫలితం దక్కలేదు. హసీనా తాజా పర్యటనలో ఈ సమస్య పరిష్కారం దిశగా కీలక చర్చలు జరగనున్నాయి.

గత 5ఏళ్ల పాలన సమయంలోనే తీస్తా నదీ జలాల సమస్యను పరిష్కరించాలని మోదీ-హసీనా భావించారు.

నిజానికి తీస్తా నదీజాలలకు సంబంధించిన ఒప్పందంపై మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ 2011లోనే సంతకం పెట్టాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అడ్డుపడడం వల్ల ఒప్పందం కుదరలేదు. రాజకీయాలతో ముడిపడిన సున్నితమైన అంశం ఇది.

"తమ దేశం నుంచి భారత్​లోకి జరుగుతున్న అక్రమ చొరబాట్లు, ఉగ్రవాద కార్యకలాపాల కట్టడిలో హసీనా విజయం సాధించారు. దీని వల్ల భారత్-బంగ్లా సరిహద్దులో శాంతియుత వాతావరణం నెలకొంది. ఎంతో కాలంగా మిగిలిపోయిన తీస్తా నదీ జలాల ఒప్పందంపై భారత్​ సంతకం చేయడం, ఎన్​ఆర్​సీ సమస్యలను పరిష్కరించడం రాజకీయ గౌరవానికి సంబంధించినవి."
--​ మునిర్​ ఖాస్రూ, ఐపీఏజీ ఛైర్మన్​.

బంగ్లాదేశ్​లో ఉంటున్న రోహింగ్యాలను మయన్మార్​కు తిరిగి పంపే అంశంపై భారత్​ వైఖరి, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపై ప్రధానమంత్రులు ప్రధానంగా చర్చించే అవకాశముంది.

(రచయిత- స్మితా శర్మ, సీనియర్ పాత్రికేయురాలు)

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Hong Kong - 2 October 2019
1. Wide of students gathering outside Tsuen Wan Public Ho Chuen Yiu Memorial College
2. Various of rally participants shouting slogans
3. Zoom out on Mr. Wong, a rally participant, speaking to media
4. SOUNDBITE (English) Mr. Wong, student rally participant:
"First, I notice that from my friend's WhatsApp, and then this is only the word description about the student who got shot in Tsuen Wan. And then I just felt my whole body is shaking. I cannot imagine that the first bullet will shot on our... on my school's student. It is ridiculous that how come college student need to got that shot? We, in this three months ... I hope that will be the last shot of the police, the last shot of the police. And no one should have got that shot. When we go to fight, we are always the egg and they are the wall. We cannot, we never have some equal stance in any circumstances. How come we can we can be their opponent? We are just bullied by them. And I hope he will get well soon. And I hope I won't see him in the court, but in the school, in our school."
5. Doris, a rally participant, sitting on the ground
6. SOUNDBITE (Cantonese) Doris, student rally participant:
"I think the force taken by the police is not reasonable, not legal and not equal. No, I mean, not reasonable, not legal, not proportional. Because even we know that there are better and more effective way to disperse the crowd, but the police still choose to use a lethal way to disperse the protesters."
7. Wide of student protesters sitting at rally
STORYLINE:
Hundreds of college students were striking on Wednesday to condemn the police shooting of their classmate on Tuesday during surging violence at Hong Kong pro-democracy protests that marred China's National Day.
It was the first time a protester had been struck by gunfire since the protests began in June and is sure to inflame anger at police, who already were accused of using excessive force against the demonstrators.
Police said the officer feared for his life and his shooting of the 18-year-old student in the chest at close range Tuesday was "reasonable and lawful."
News reports say he is in critical but stable condition.
On Wednesday, students at the Tsuen Wan Public Ho Chuen Yiu memorial college — which the teen attended — criticized the police officer's actions.
One rally participant said the use of force against protesters is "not reasonable, not legal and not equal."
Students also chanted anti-police slogans and demanded accountability.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 2, 2019, 9:19 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.