ETV Bharat / bharat

'బాబ్రీ' కేసు తీర్పునకు 3నెలల గడువు పెంపు - babri verdict

బాబ్రీ మసీదు కేసులో తుది తీర్పునకు నూతన గడువు విధించింది సుప్రీంకోర్టు. ఆగస్టు 31లోగా తీర్పు చెప్పాలని లఖ్​నవూలోని సీబీఐ ప్రత్యేక కోర్టును ఆదేశించింది. ఈ కేసులో భాజపా సీనియర్ నేతలు ఎల్​కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి నిందితులుగా ఉన్నారు.

babri
బాబ్రీ కూల్చివేత కేసులో తీర్పునకు ఆగస్టు 31 గడువు
author img

By

Published : May 8, 2020, 6:47 PM IST

Updated : May 8, 2020, 7:49 PM IST

బాబ్రీ మసీదు కేసులో తుది తీర్పు కోసం మూడు నెలల గడువు పెంచింది సుప్రీంకోర్టు. ఆగస్టు 31లోగా తీర్పు చెప్పాలని లఖ్​నవూలోని సీబీఐ కోర్టును ఆదేశించింది. ఈ కేసులో భాజపా సీనియర్ నేతలు లాల్ కృష్ణ అడ్వాణీ, ఉమా భారతి, మురళీ మనోహర్ జోషి నిందితులుగా ఉన్నారు.

ఇదీ నేపథ్యం..

1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు ఘటన జరిగింది. ఈ కేసు విచారణ లఖ్​నవూ కోర్టులో గత 30 ఏళ్లుగా కొనసాగుతోంది.

పలు సెక్షన్ల కింద కేసు నమోదు..

ఎఫ్​ఐఆర్ నెంబర్ 197/92 క్రిమినల్​ లా చట్టంలోని సెక్షన్ 7, ఐపీసీ సెక్షన్లు 395, 397, 332, 333, 338, 295, 297, 153ఏ కేసుల కింద గుర్తుతెలియని కరసేవకులపై కేసు నమోదైంది.

రెండో ఎఫ్​ఐఆర్​లో ఐపీసీ 153ఏ, 153బీ, 505సెక్షన్ల కింద ఎల్​కే అడ్వాణీ, అశోక్ సింఘాల్, గిరిరాజ్ కిశోర్, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి, వినయ్ కటియార్, విష్ణు హరి దాల్మియా, సాధ్వీ రితంభరలపై కేసు నమోదు చేశారు.

బాబ్రీ ఘటనకు సంబంధించి 49 కేసులను నమోదు చేసింది సీబీఐ. 40మందిపై 1993, అక్టోబర్ 5న లఖ్​నవూ లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఉమ్మడి ఛార్జీషీటు దాఖలు చేసింది. ఇప్పటికే పలువురు నిందితులు మరణించారు.

ఇదీ చూడండి: సుప్రీం 'అయోధ్య' తీర్పులో ఎన్నో ప్రత్యేకతలు

Last Updated : May 8, 2020, 7:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.