ETV Bharat / bharat

బాబ్రీ మసీదు కేసు.. పూర్తి కథనాలు

బాబ్రీ కేసులో 28ఏళ్ల పాటు సాగిన ఉత్కంఠకు తెరదించుతూ.. బుధవారం తీర్పును వెలువరించింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. కేసులో నిందితులుగా ఉన్న 32మందిని నిర్దోషులుగా తేల్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన ఎల్​ కే అడ్వాణీ.. తీర్పును స్వాగతించారు. అయితే తీర్పును సవాలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సీబీఐ వెల్లడించింది.

Babri case: All 32 accused acquitted
బాబ్రీ తీర్పుతో వీడిన 28ఏళ్ల ఉత్కంఠ
author img

By

Published : Sep 30, 2020, 11:37 PM IST

Updated : Sep 30, 2020, 11:53 PM IST

28 ఏళ్ల నుంచి ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న బాబ్రీ మసీదు కేసుపై ఎట్టకేలకు తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఉప ప్రధాని ఎల్‌.కె.ఆడ్వాణీ(92), మురళీ మనోహర్ జోషి(86), ఉమా భారతితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న 32మందిని నిర్దోషులుగా తేల్చింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.

పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

అడ్వాణీ, జోషి హర్షం...

వివాదాస్పద బాబ్రీ మసీదు కేసులో నిందితులందరినీ సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించటంపై భాజపా నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులు ఎల్​కే అడ్వాణీ, జోషి.. కోర్టు తీర్పును స్వాగతించారు.

పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

సీబీఐ స్పందన...

బాబ్రీ కేసులో 32 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును.. సవాల్​ చేయాలని భావిస్తోంది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). ఈ అంశంలో న్యాయ విభాగాన్ని సంప్రదించిన అనంతరం.. నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది సీబీఐ.

పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

కమల దళంలో ఉత్సాహం...

ఏళ్ల నుంచి ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న బాబ్రీ కేసులో ఎట్టకేలకు తీర్పు వెలువడటం.. భాజపాలో నయా జోష్​ తీసుకొచ్చింది. పార్టీ అగ్రనేతలపై ఏళ్లుగా ఉన్న ఈ ఆరోపణల నుంచి విముక్తి లభించినట్లయిందని శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

కాంగ్రెస్​ విమర్శలు...

వివాదాస్పద బాబ్రీ మసీదు కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును విమర్శించింది కాంగ్రెస్​. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి.. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉందని ఆరోపించింది.

పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

1992 డిసెంబర్​ 6న బాబ్రీ మసీదు ఘటన జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించిన పరిణామాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

Last Updated : Sep 30, 2020, 11:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.