చలి కారణంగా రక్తప్రసరణ తగ్గి.. బీపీ పెరుగుతుంది. ఈ కారణంగా గుండె జబ్బులు వస్తాయి. ఆస్తమా, కీళ్ల నొప్పులు బాధిస్తాయి. ఇలాంటి సమయాల్లో చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చలి పుట్టించే ఇబ్బందుల నుంచి బయట పడొచ్చు అంటున్నారు యోగా గురువు బాబా రామ్‌దేవ్.
చిట్కాలివే...
⦁ శ్వాస సంబంధిత వ్యాధులున్నవారు 30 సొంటి కాయలు పొడి చేసుకుని ఉదయం సాయంత్రం ఒక్కో చెంచా తీసుకోవాలి. మూడు పూటలా కలబంద రసం తాగాలి. వీలైతే.. పాలల్లో శిలాజిత్, కాస్త పసుపు మరిగించి తాగాలి.
⦁ ఇక ఎవరికైతే దగ్గు, ఎలర్జీ, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయో వారు పాలల్లో సాస్రీ, గిలోయ్ వేసి తాగితే.. చలి వల్ల కలిగే ఏ అనారోగ్యమూ దరిచేరదు. శరీరం వెచ్చబడి అంతగా చలి పెట్టదు.
⦁ ప్రాణాయామం చేయడం వల్ల కలిగే లాభాలు మీకు తెలిసిందే.
⦁ ఇంటి చిట్కాలు పాటించాలి. ఉత్తర భారతంలో నువ్వుల లడ్డూలు తినాలి. ఎండు ఖర్జూరాలు బాగా తినాలి.
⦁ చలి నుంచి చర్మాన్ని కాపాడుకోవడానికి నువ్వుల నూనెతో మర్దన చేయాలి. ఇలా చేస్తే చర్మం లోపలికి చలి చొరబడలేదు.
⦁ సూర్య నమస్కారం, వ్యాయామం ఉపకరిస్తుంది. ప్రాణాయామం చేస్తే శరీరమంతా శక్తి ఉత్పత్తి అవుతుంది.
అనారోగ్యాన్ని జయించే శక్తి ఎక్కడో లేదు మన శరీరంలోనే ఉందంటారు బాబా.
"రక్తపోటు ఉన్నవారు అనులోమ, విలోమ, భ్రమరీ ప్రాణాయామం చేయాలి. గుండెజబ్బుతో బాధపడేవారు అర్జుణ కాయలు, దాల్చిన చెక్క పాలల్లో కలిపి తాగితే ఎలాంటి ఇబ్బందులు కలుగవు. కీళ్ల నొప్పులు ఉన్న వారు పాలు, పసుపుతో పాటు చంద్ర ప్రభావ్ చాయ్, యోగ్రాజ్ కుల్‌కుల్ పొడి, కలబంద రసం రోజుకు మూడు సార్లు తాగాలి. చలి నుంచి తప్పించుకోవాలంటే నాలాగా సామర్థ్యం ఉన్నవారు పరిగెత్తాలి. అలా చేస్తే చలికాలంలో కూడా చెమటలు పడతాయి."
-బాబా రామ్‌దేవ్
ఇదీ చూడండీ:నిర్భయ' దోషులకు ఈనెల 22న ఉరిశిక్ష