ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మద్దతుగా ముస్లిం మహిళలు ప్రదర్శనలు చేశారు. మోదీ (ఖుదాకా నూర్ హై.. భారత్ కా కోహినూర్ హై) అల్లా ఇచ్చిన కాంతి రేఖ అని, భారత దేశపు కోహినూర్ వజ్రమని ప్లకార్డుల్లో ప్రశంసల వర్షం కురిపించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి తిరిగి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షించారు. మోదీ ప్రభుత్వం వల్లే తమ జీవితాలు మారుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు.
"ముమ్మారు తలాక్‌ను ప్రధాని నరేంద్ర మోదీ రద్దు చేశారు. ఈ నిర్ణయంతో మేము ఎంతో ఆనందంగా ఉన్నాం. మోదీ ప్రభుత్వం వల్లే ఈరోజున మా స్థితి మారుతోంది. ప్రధాని మంత్రి అయ్యాక ముమ్మారు తలాక్ చట్టాన్ని రద్దు చేస్తామని రాహుల్ అన్నారు. ఆయన ఆలోచన చాలా తప్పు. మాకు బలమైన సర్కారు కావాలి. ఇప్పుడే ప్రశాంతంగా జీవిస్తున్నాం. కానీ రాహుల్ గాంధీ మాటలతో మళ్లీ భయపడుతున్నాం."
-హుమ భాను, ముస్లిం మహిళ.
గత ప్రభుత్వాల వల్ల మహిళలకు స్వేచ్ఛ లేదని... మోదీ ప్రభుత్వం వల్లే నచ్చిన పని చేసుకునే స్వేచ్ఛ దొరికిందని అన్నారు. ఇతర మహిళలూ మోదీకే ఓటు వేయాలని అభ్యర్థించారు.