అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై సమీక్షకు వెళ్లాలా? వద్దా? అనే విషయంపై ఈ నెల 17న ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ) భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. సీనియర్ న్యాయవాది జఫర్‌యాబ్ జిలానీ ఈ విషయాన్ని వెల్లడించారు.
అయోధ్య కేసులో ఉత్తర్‌ప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు తరఫున అలహాబాద్ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో జిలానీ వాదించారు.
భిన్నాభిప్రాయాలు
దశాబ్దాల వివాదానికి తెరదించుతూ అయోధ్య కేసులో సుప్రీంకోర్టు శనివారం చారిత్రక తీర్పు వెలువరించింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిలో రామమందిరం నిర్మించాలని, మసీదు కట్టేందుకు అయోధ్యలో 5 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్‌బోర్డుకు కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అయోధ్య తీర్పుపై రివ్యూకి వెళ్లాలా వద్దా అనే విషయంపై ముస్లిం వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చూడండి: 'మహా' ఉత్కంఠ: కాంగ్రెస్ నిర్ణయంపైనే అందరి దృష్టి