ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్యలోని నందిగ్రామ్ ఏడాదికాలంగా రామనామ స్మరణలతో మారుమోగుతోంది. ఇలాగే మరో 13 ఏళ్లపాటు శ్రీరామ సంకీర్తనలతో పరిమళించనుంది.
ఏడాది దాటినా...
నందిగ్రామ్‌లో 2018 అక్టోబర్ 14న రామకీర్తనలను ప్రారంభించారు శ్రీ రామజానకి ఆలయ నిర్వహకులు. అప్పటి నుంచి ప్రపంచంలో శాంతిని నెలకొల్పాలనే లక్ష్యంతో 24 గంటలపాటు నిరంతరాయంగా రామ కీర్తనలు ఆలపిస్తున్నారు. ఇప్పటికే ఏడాది పూర్తి చేసుకున్న ఈ రామ్ నామ్ సంకీర్తన్ మరో 13 ఏళ్ల పాటు అంటే 2032 వరకు కొనసాగుతుందని చెబుతున్నారు నిర్వహకులు.
"ఇక్కడ 14 ఏళ్ల పాటు సీతారాములవారి సంకీర్తనలు నడుస్తాయి. లోకకల్యాణం కోసం, ప్రజలను ధర్మంతో కలిపేందుకు 24 గంటలు ఇలా రామ కీర్తనలు ఆలపిస్తున్నాం. ఈ అఖండ్ రామ్ నామ్ సంకీర్తనలను నిరంతరాయంగా కొనసాగించేందుకు 365 జట్లు ఏర్పడ్డాయి."
-భవానీ పాండే, నిర్వహకుడు
పవిత్ర స్థలం కనుక..
నందిగ్రామ్‌లోని 'రామ్ భారత్ మిలాప్' ఆలయానికి సమీపంలో ఉన్న శ్రీ రామజానకి దేవాలయంలో ఈ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడికి కొద్ది దూరంలో ఉన్న బావిలో నుంచి రుషి రాజు భరతుడ్ని పూజించడానికి నీళ్లు తీసుకువెళ్లేవాడని, అందులో 27 తీర్థాల జలాలు కలిసి ఉన్నాయని ఇక్కడి వారి నమ్మకం. అందుకే ఇంతటి పవిత్ర ప్రదేశంలో రామున్ని స్మరిస్తే తప్పకుండా ప్రపంచంలో శాంతి నెలకొంటుందని నమ్ముతున్నారు భక్తులు.
రామ నామ జపంలో స్థానిక ప్రజలు చురుకుగా పాల్గొంటున్నారు. ఈ వినూత్న కార్యక్రమంతో ఆలయానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది.
ఇదీ చూడండి:'ఈటీవీ భారత్'ను మెచ్చిన భారత కబడ్డీ కెప్టెన్