అయోధ్య మసీదు నిర్మాణ ఏర్పాట్లు ప్రారంభించిన ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసీఎఫ్) తాజాగా మసీదు లోగోను విడుదల చేసింది. బహుభుజి ఆకృతిలో ఉన్న ఈ లోగో హుమాయూన్ సమాధిలో ఉపయోగించిన క్లిష్టమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఇండో- ఇస్లామిక్ సంస్కృతిని ప్రతిబింబించేలా దీన్ని రూపొందించారు. అలాగే, ప్రపంచంలోని బహుళ సంస్కృతుల వారసత్వానికి ప్రతీకగా ఉంటుందని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.
యూపీలోని అయోధ్యకు దాదాపు 20కి.మీల దూరంలోని ధన్నీపూర్ గ్రామంలో ఐదెకరాల స్థలంలో మసీదుతో పాటు కమ్యూనిటీ కిచెన్, ఆస్పత్రి, రీసెర్చి సెంటర్ ఇతర వసతులు ఏర్పాటు చేయనున్నారు.
దశాబ్దాల కాలం పాటు దేశ రాజకీయాలకు కేంద్రంగా నిలిచిన అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఇటీవల శంకుస్థాపన జరిగింది. సుప్రీంకోర్టు జోక్యంతో ఈ వివాదం సద్దుమణగడం వల్ల రామమందిరం నిర్మాణంతో పాటు ఐదెకరాల స్థలంలో మసీదు నిర్మాణానికీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇదీ చూడండి:- 'అయోధ్య మసీదు విరాళాల కోసం రెండు బ్యాంకు ఖాతాలు'