అయోధ్యలో రామమందిరం భూమిపూజ కోసం లక్షా 11 వేల లడ్డులను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మణిరాం దాస్ ఛావ్ నీ అనే వ్యక్తి ఈ లడ్డూలను తయారు చేస్తున్నారని వెల్లడించారు.
ఆగస్టు 5న జరిగే వేడుకకు ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా సుమారు 200 మంది అతిథులు హాజరు కానున్నారు.
4 లక్షల లడ్డూలకు ఆర్డర్..
దిల్లీలోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాలకు లడ్డూలను పంపిణీ చేసేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం నాలుగు లక్షల ప్యాకెట్ల లడ్డూలను ఆర్డర్ ఇచ్చినట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు.
32 సెకన్లలో పూర్తయ్యేలా..
ఆగస్టు 3న గణేశుడి పూజతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని పేర్కొన్న ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా.. ఆగస్టు 5న గర్భగుడిలో జరిగే కార్యక్రమంలో 11 మంది పాల్గొంటారని చెప్పారు. ఆ రోజు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 15 నిమిషాల 15 సెకన్లకు మొదలుపెట్టి 32 సెకన్లలో శంకుస్థాపన జరిగేలా ముహూర్తం నిర్ణయించారు. ఇందుకోసం అయోధ్య ఇప్పటికే సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
ఇదీ చదవండి: రామమందిరం భూమిపూజలో వెండి ఇటుకలు