అయోధ్య భూవివాదం కేసులో సుప్రీంకోర్టుకు మధ్యవర్తిత్వ కమిటీ నివేదిక సమర్పించింది. జులై 18న సుప్రీం ఆదేశాల మేరకు నివేదికను సిద్ధం చేసింది. పరిశీలన అంశాలను సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు సీల్డ్ కవర్లో అందజేశారు కమిటీ సభ్యులు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం రేపటి నుంచి నివేదికపై విచారణ ప్రారంభించనుంది.
వివాదాస్పద భూమిపై కేసు...
అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖాడా, రామ్ లల్లాకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా ఇప్పటివరకు సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి.
'మధ్యవర్తిత్వమే మార్గం...'
మార్చి 8న ఈ పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాన్ని శాశ్వతంగా పరిష్కరించడానికి మధ్యవర్తిత్వమే మార్గమని తీర్మానించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఖలీఫుల్లా ఛైర్మన్‌గా మధ్యవర్తిత్వ ప్యానెల్ ఏర్పాటు చేసింది. ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచూను సభ్యులుగా నియమిస్తూ జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది.