ETV Bharat / bharat

శ్రామిక్​ రైళ్ల ద్వారా రైల్వేకు 360 కోట్ల ఆదాయం - శ్రామిక్​ రైళ్లు

మే 1 నుంచి శ్రామిక్​ రైళ్ల ద్వారా వలసకూలీలను తరలించడం కోసం ఒక్కో కార్మికుడి నుంచి సగటున రూ. 600 వసూలు చేసినట్టు రైల్వేే శాఖ పేర్కొంది. ఈ మేరకు 360 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు మొత్తం 60 లక్షల మందిని స్వస్థలాలకు తరలించినట్లు వెల్లడించారు.

Average fare on Shramik trains Rs 600, says Railways; generated Rs 360 cr in revenue
శ్రామిక్​ రైళ్ల ద్వారా రైల్వే శాఖకు 360 కోట్ల ఆదాయం
author img

By

Published : Jun 16, 2020, 5:11 AM IST

దేశవ్యాప్తంగా మే 1 నుంచి 60లక్షల వలస కార్మికులను శ్రామిక్​ రైళ్ల ద్వారా వారి సొంత రాష్ట్రాలకు చేర్చినట్లు తెలిపింది రైల్వే శాఖ. వారి నుంచి సగటున రూ. 600 వసూలు చేయగా... మొత్తం 360 కోట్ల రూపాయల ఆదాయం అర్జించినట్లు స్పష్టం చేసింది.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 4,450 శ్రామిక్​ రైళ్లను నడిపినట్లు రైల్వే బోర్డు ఛైర్మన్​ వీకే యాదవ్​ తెలిపారు.

శ్రామిక్​ ప్రత్యేక రైళ్ల సగటు ఛార్జీలు ఒక్కొక్క ప్రయాణికుడికి రూ. 600. ఇవి సాధారణ ఛార్జీలే కానీ ప్రత్యేక రైళ్లల్లో వసూలు చేసే ఛార్జీలు కాదని దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పటివరకు 60లక్షల మంది ప్రయాణికులను తరలించాము. వారిని తరలించడానికి అయిన ఖర్చులో 15 శాతం మాత్రమే తిరిగి పొందగలిగాము.

వీకే యాదవ్​, రైల్వే బోర్డు ఛైర్మన్​.

వలస కూలీల తరలింపుకు ఒక్కో రైలుకు 75 నుంచి 80 లక్షల మధ్య ఖర్చు అయ్యి ఉంటుందని యాదవ్​ తెలిపారు. ఈ ఖర్చు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 85:15 నిష్పత్తిలో పంచుకున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:పెట్రోల్​, డీజిల్​పై లీటరుకు రూ.2 బాదుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.