దిల్లీలో ఏడేళ్లలో ఈ ఆగస్టు నెలలోనే అత్యధిక వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టులో మొత్తం 236.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపింది.
ఆగస్టులో అత్యధికంగా 13వ తేదీన 68.2 మిల్లి మీటర్ల, 20న 54.8 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది.
మొత్తం మీద చూస్తే దిల్లీలో గత ఏడాది ఆగస్టులో 119.6 మిల్లీ మీటర్లు, 2018లో 206 మిల్లీ మీటర్లు, 2017లో 152.2 మిల్లీ మీటర్లు, 2016లో 122.1 మిల్లీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
అంతకుముందు 2013 ఆగస్టులో అత్యధికంగా 321.4 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం.
వానాకాలం ప్రారంభమైన జూన్ 1 నుంచి ఇప్పటి వరకు రాజధాని నగరంలో 555 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
ఇదీ చూడండి:ఒడిశాలో వరద బీభత్సం- 17 మంది మృతి