ETV Bharat / bharat

అటార్నీ జనరల్‌గా కేకే వేణుగోపాల్‌ కొనసాగింపు

అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్ పదవీ కాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. ఈ నెలాఖరుతో అటార్నీ జనరల్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం.

kk venugopal
అటార్నీ జనరల్‌గా కేకే వేణుగోపాల్‌ కొనసాగింపు
author img

By

Published : Jun 14, 2020, 8:32 AM IST

సీనియర్‌ న్యాయవాది కేకే వేణుగోపాల్‌ను మరో ఏడాదిపాటు అటార్నీ జనరల్‌గా కొనసాగిస్తున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వెల్లడించారు. ఈ నెలాఖరుతో కేకే వేణుగోపాల్‌ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ‘

''మూడేళ్లుగా అటార్నీ జనరల్‌గా కేకే వేణుగోపాల్‌ అందిస్తున్న సేవలు అభినందనీయం. మరో ఏడాదిపాటు కొనసాగాలని కోరగా ఆయన అంగీకరించారు.'' అని రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. 'ఏడాది ముగిసేనాటికి నా వయసు 90కి చేరుకుంటుంది. నాకు తెలిసి ప్రపంచంలో ఈ వయసులో పనిచేసే అటార్నీ జనరల్‌ లేదా న్యాయ అధికారి ఎవరూ లేరు' అని కేకే వేణుగోపాల్‌ అన్నారు.

ఇదీ చూడండి: 'భారతీయ మహిళలకు వైరస్ ముప్పు అధికం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.