ETV Bharat / bharat

నేవీ మాజీ అధికారిపై దాడిలో ఆరుగురి అరెస్టు- కాసేపటికే బెయిల్

మహారాష్ట్ర ముంబయిలో నేవీ మాజీ అధికారి మదన్​ శర్మపై దాడి చేసిన కేసులో ఆరుగురిని అరెస్టు చేశారు. అయితే, అరెస్టయిన కాసేపటికే నిందితులకు బెయిల్ మంజూరైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు సంబంధించిన ఓ కార్టూన్​ను వాట్సాప్​లో పంచుకున్నారు 62 ఏళ్ల రిటైర్డ్ నేవీ అధికారి. ఈ నేపథ్యంలో ఆయనపై శివసేన కార్యకర్తలు దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

author img

By

Published : Sep 12, 2020, 10:33 AM IST

Updated : Sep 12, 2020, 11:58 AM IST

Retd Navy
నేవీ మాజీ అధికారిపై దాడి

మహారాష్ట్రలో నేవీ మాజీ అధికారి మదన్​ శర్మపై దాడి చేసిన కేసులో ఆరుగురిని అరెస్టు చేశారు ముంబయి పోలీసులు. ఆయనపై శివసేన కార్యకర్తలు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో కూడా వైరల్​ అయింది.

నేవీ మాజీ అధికారిపై దాడి

అరెస్టయిన వారిలో శివసేన కార్యకర్త కమలేశ్ కదం ఉన్నారు. వీరిని సమతా నగర్​ ఠాణాకు తరలించగా.. కాసేపటికే బెయిల్ మంజూరైంది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే కార్టూన్​ను వాట్సాప్​లో మదన్​ షేర్​ చేయగా వివాదం రాజుకుంది. లోఖండ్​వాలాలో మదన్​పై శుక్రవారం ఉదయం కొంతమంది శివసేన కార్యకర్తలు దాడి చేసినట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు. ఆయన కళ్లకు తీవ్ర గాయమైందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని స్పష్టం చేశారు.

'ఇలాంటి ప్రభుత్వమా?'

తనపై శివసేన కార్యకర్తలే దాడి చేసినట్లు మదన్​ ఆరోపించారు.

"నేను వాట్సాప్​లో కార్టూన్​ పంపాక.. కొంతమంది నాకు బెదిరింపు కాల్స్ చేశారు. ఆ తర్వాత ఇంటికొచ్చిన 8- 10 మంది వ్యక్తులు నన్ను కొట్టారు. నేను నా జీవితమంతా దేశం కోసం పనిచేశా. ఇలాంటి ప్రభుత్వం ఉండకూడదు.

మన దేశంలో ప్రతి వ్యక్తికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. వాట్సాప్.. ఇతరులతో అనుసంధానమయ్యేందుకు సమాచారాన్ని పంచుకోనేందుకు ఒక మాధ్యమం. సందేశాలు ఎవరు పంపిస్తున్నారు, ఎందుకు చేస్తున్నారనే విషయాన్ని గుర్తించాల్సింది ప్రభుత్వం."

- మదన్​ శర్మ, నేవీ మాజీ అధికారి

ఫడణవీస్​ స్పందన..

ఈ ఘటనపై ప్రతిపక్ష నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫఢణవీస్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి వార్తలు విని దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. ఈ దాడికి పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఠాక్రేను డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: నేర రాజకీయాల విశ్వరూపం!

Last Updated : Sep 12, 2020, 11:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.