ETV Bharat / bharat

'అక్కడి ప్రజలకు అటల్​ టన్నెల్ ఓ​ వరప్రదాయిని' - జేపీ నడ్డా వార్తలు

ప్రధాని మోదీ ప్రారంభించిన అటల్​ సొరంగ మార్గం హిమాచల్ ​ప్రదేశ్​, లద్దాఖ్​ ప్రజలకు వరప్రదాయినిగా నిలవనుందని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా అన్నారు. దీని ద్వారా ప్రజలుకు మెరుగైన వైద్య, వ్యాపార సేవలు సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ, హిమాచల్​ ప్రదేశ్​ ప్రజల మధ్య ప్రత్యేక బంధానికి 'అటల్​ సొరంగ మార్గం' సాక్ష్యంగా నిలుస్తుందన్నారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.

Atal tunnel to be a major boon for people of Himachal, Ladakh, says Amit Shah
అక్కడి ప్రజలకు అటల్​ టన్నెల్ ఓ​ వరప్రదాయిని: షా
author img

By

Published : Oct 3, 2020, 8:11 PM IST

భారత్​ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అటల్​ టన్నెల్ హిమాచల్ ​ప్రదేశ్​, లద్దాఖ్ ప్రాంత వాసులకు వరప్రదాయినిగా నిలవనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా తెలిపారు. వైద్య, వ్యాపార కార్యకలాపాలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 9.02 కి.మీ ఉన్న ఈ సొరంగ మార్గం వ్యూహాత్మకంగానూ భారత్​కు కీలకం కానున్నట్లు ట్విట్టర్​ వేదికగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

"ఈ సొరంగ మార్గం నిర్మాణంతో వాజ్‌పేయీ కలను నిజం చేశాం. ప్రపంచంలోనే ఇది అతి పొడవైన హైవే టన్నెల్​. దేశానికి రక్షణపరంగానూ చాలా వ్యూహాత్మకమైనది. అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకొనేలా నిర్మించాం. మనాలీ- లేహ్​ మధ్య ప్రయాణ సమయం 4-5 గంటలు తగ్గుతుంది. ఈ టన్నెల్​తో పర్యటక రంగానికి నూతనోత్తేజం రానుంది. కొత్తగా ఉద్యోగాలు ఏర్పడతాయి."

- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి

దశాబ్దాల నాటి కల సాకారమాయే..

హిమాచల్​ ప్రదేశ్​లోని అటల్​ సొరంగం.. 'వ్యూహాత్మకంగా ప్రధానమైంద'ని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభివర్ణించారు. సరిహద్దులో మౌలిక వసతుల కల్పనకు ఈ ప్రాజెక్టు.. బలం చేకూరుస్తుందని ట్విట్టర్ వేదికగా చెప్పారు. హిమాచల్​ ప్రదేశ్​ ప్రజలకు, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మధ్య ఒక ప్రత్యేక అనుబంధానికి ఉదాహరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.

'ఆయనకిచ్చే ఘనమైన నివాళి'

2014లో మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టును త్వరగా ముగించినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు నడ్డా. హిమాచల్​ ప్రదేశ్​ వాసుల దశాబ్దాల నాటి కలను నిజం చేశారని కొనియాడారు. మోదీకి ఈ 'అటల్ సొరంగ మార్గం' డ్రీమ్​ ప్రాజెక్ట్​గా​ ఉండేదని అన్నారు.

"ఈ సొరంగం..మోదీకి, హిమాచల్​ ప్రదేశ్​ ప్రజలకు ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పరుస్తుంది. మాజీ ప్రధాన మంత్రి వాజ్​పేయీ.. ఆలోచనల్లోంచి పుట్టిన ఈ ప్రాజెక్టు, ఆయనకు అందించే ఘనమైన నివాళి. "

- జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈ అటల్​ సొరంగాన్ని శనివారం ప్రారంభించారు. ప్రపంచంలోనే అతి పొడవైన ఈ సొరంగ మార్గం.. మనాలీ నుంచి లేహ్​కు మధ్య 42 కి.మీ.ల దూరాన్ని తగ్గిస్తుంది. ప్రయాణ సమయాన్ని నాలుగు నుంచి ఐదు గంటల వరకు ఆదా చేస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.