'అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్స్ అచీవ్మెంట్స్' (ఏఆర్ఐఐఏ) జాబితాను కేంద్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఉన్న కేంద్రం ఆధారిత ఇన్స్టిట్యూట్స్ కేటగిరీలో.. మద్రాస్, బాంబే, దిల్లీ ఐఐటీలు తొలి మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి.
ఆవిష్కరణ విషయంలో ఉన్నత విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలకు ర్యాంకులు అందిస్తూ వస్తోంది కేంద్ర విద్యాశాఖ. ఆరు కేటగిరీల్లో ర్యాంకింగ్స్ ఇస్తారు. అవి.. జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఉన్న కేంద్రం ఆధారిత సంస్థలు, రాష్ట్ర ఆధారిత వర్సిటీలు, రాష్ట్ర ఆధారిత స్వతంత్ర సంస్థలు, డీమ్డ్ వర్సిటీలు, ప్రైవేటు సంస్థలు, కేవలం మహిళలకే ఉన్నత విద్య అందించే సంస్థలు.
తొలి కేటగిరీలో ఐఐఎస్ఈ బెంగళూరు, ఐఐటీ ఖరగ్పుర్లు ,5 స్థానాలు దక్కించుకున్నాయి. టాప్ 10లో 7 ఐఐటీలు చోటు దక్కించుకోవడం విశేషం.
రాష్ట్ర ఆధారిత వర్సిటీల్లో మహారాష్ట్రలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, పంజాబ్ యూనివర్సిటీలు తొలి రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయి.
ఇదీ చూడండి:- ఒకట్రెండు రోజుల్లో టీకాపై మూడో దశ ట్రయల్స్