ETV Bharat / bharat

మాస్కులతో దర్శనమిస్తున్న దేవుళ్ల విగ్రహాలు..!

author img

By

Published : Mar 11, 2020, 9:42 AM IST

Updated : Mar 11, 2020, 12:53 PM IST

ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న కరోనా భారత్​లోనూ పంజా విసురుతోంది. అయితే ఈ ప్రాణాంతక వైరస్​పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులతో పాటు.. పూజారులూ సంకల్పించారు. దీనిలో భాగంగా వారణాసిలోని పూజారులు వినూత్నంగా.. ప్రహ్లాదేశ్వరస్వామి ఆలయంలోని పలు విగ్రహాలకు మాస్కులు ధరింపజేయడం అక్కడి భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

At UP temple, Lord Shiva wears mask to raise awareness on coronavirus
మాస్కు ధరించిన దేవుడు
మాస్కులతో దర్శనమిస్తున్న దేవుళ్ల విగ్రహాలు..!

చైనా వుహాన్​లో పుట్టుకొచ్చిన ప్రాణాంతక కరోనా వైరస్​ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. 4 వేలకు పైగా ప్రజలు ఈ మహమ్మారికి బలయ్యారు. ఈ నేపథ్యంలో ప్రజలకు వైరస్​పై అవగాహన కల్పించేందుకు విభిన్న ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలోనే వారణాసిలోని ప్రహ్లాదేశ్వరస్వామి ఆలయంలో అక్కడి పూజారులు కూడా మాస్కులు ధరించి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఓ పూజారి విశ్వనాథుడి విగ్రహానికి, మందిరంలోని ఇతర విగ్రహాలకు కూడా మాస్కులు ధరింపజేయడం భక్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాకుండా విగ్రహాలను ముట్టుకోవద్దంటూ పూజారులు.. భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

"కరోనా వైరస్‌ దేశమంతటా వ్యాప్తిస్తోంది. ఈ విషయమై ప్రజల్లో అవగాహన తీసుకురావటానికి మేం విశ్వనాథుడి విగ్రహానికి కూడా మాస్కు వేశాం. ఇక్కడి విగ్రహాలకు శీతాకాలంలో వెచ్చని దుస్తులు, వేసవిలో ఫ్యాన్లు, ఏసీలు వేస్తాం. అలాగే కరోనా దేశమంతా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇక్కడి విగ్రహాలకు కూడా మాస్కులు ధరింపజేశాం. కరోనా వైరస్‌ వ్యాప్తించకుండా ఉండటానికి విగ్రహాలను తాకొద్దని కూడా భక్తులకు సూచిస్తున్నాం"

-కృష్ణ ఆనంద్‌ పాండే, ఆలయ పూజారి

ఇదీ చూడండి: కాంగ్రెస్ పార్టీ నవతరంలో గూడుకట్టుకున్న 'అసంతృప్తి'

Last Updated : Mar 11, 2020, 12:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.