దిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) ప్రధాన కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగుల్లో ఇద్దరికి కరోనా నిర్ధరణ అయింది. ఎంఈఏలోని న్యాయ విభాగంలో పని చేస్తోన్న ఒక ఉద్యోగి సహా సెంట్రల్ యూరప్ విభాగానికి చెందిన కన్సల్టెంట్‌కు ఈ వారం ప్రారంభంలో కొవిడ్ నిర్ధరణ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సెంట్రల్ యూరప్ విభాగంలోని దాదాపు మొత్తం సిబ్బంది, న్యాయ విభాగంలోని పెద్ద సంఖ్యలో ఉద్యోగులను 14 రోజుల స్వీయ నిర్బంధంలోకి పంపినట్లు తెలుస్తోంది.
మెడికల్ డైరెక్టర్‌కూ కరోనా..
దిల్లీలో కరోనా చికిత్స అందిస్తున్న అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి ఎల్ఎన్జేపీ హాస్పిటల్.. మెడికల్ డైరెక్టర్ సురేశ్ కుమార్‌కూ కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. అదే ఆస్పత్రిలో మరో ఇద్దరు సిబ్బందికీ కొవిడ్ నిర్ధరణ అయినట్లు శనివారం పేర్కొన్నారు. మే 17నే మెడికల్ డైరెక్టర్‌గా సురేశ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.
ఇదీ చూడండి:సాయం అందించబోతే.. తల తెగిపోయింది!