ETV Bharat / bharat

'కరోనా దెబ్బకు 20% విద్యార్థులు డ్రాపౌట్!' - ఈటీవీ భారత్​తో కమల్​ గౌర్​ ముఖాముఖి

కరోనా కారణంగా విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంలో పడింది. చాలా మంది చిన్నారులు విద్యకు దూరమయ్యారు. ఆన్​లైన్​లో ఎంతవరకు నేర్చుకుంటున్నారనేదానికి సమాధానం లేదు. ఏకంగా 160 కోట్ల మంది విద్యార్థుల అభ్యాసాన్ని కరోనా దెబ్బతీసింది. మరిప్పుడు చేయాల్సిందేంటి? పాఠశాలలు తెరవాలా? ఆన్​లైన్ మాధ్యమంలో విద్య కొనసాగించేందుకు ఉన్న అవరోధాలేంటి?

At least 20% students will drop out of education system post-COVID: Save the Children
'ప్రపంచంలో 91 శాతం మంది విద్యార్థులపై కరోనా దెబ్బ'
author img

By

Published : Jul 16, 2020, 2:26 PM IST

కొవిడ్-19 సంక్షోభం తర్వాత చిన్నారుల విద్యాభ్యాసంపై ప్రమాదకరమైన ప్రభావం పడుతుందని సేవ్​ ద చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ హెచ్చరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 160 కోట్ల మంది విద్యార్థుల అభ్యాసాన్ని కరోనా మహమ్మారి తీవ్రంగా దెబ్బతీసిందని తన నివేదిక సేవ్ అవర్ ఎడ్యుకేషన్​లో వెల్లడించింది. మొత్తం విద్యార్థుల సంఖ్యలో ఇది 91 శాతమని స్పష్టం చేసింది. కొవిడ్ కారణంగా విద్యావ్యవస్థకు దూరంగా ఉన్న విద్యార్థుల్లో చాలా మంది మళ్లీ తరగతులకు రాలేరని అధ్యయనం తెలిపింది.

ఈ అంశంపై సేవ్​ ద చిల్ట్రన్ ఇండియా విద్యా విభాగం డిప్యూటీ డైరెక్టర్ కమల్ గౌర్ ఈటీవీ భారత్​తో మాట్లాడారు. కరోనా నేపథ్యంలో భారత్​లో విద్యార్థుల పరిస్థితిని వివరించారు.

ఈటీవీ భారత్​తో కమల్​ గౌర్​ ముఖాముఖి

భారత్​తో పాటు ప్రపంచ విద్యా వ్యవస్థపై కరోనా ప్రభావం ఎలా ఉంటుంది?

ప్రీ-ప్రైమరీ నుంచి తృతీయ స్థాయి వరకు 32.2 కోట్ల మంది విద్యార్థుల అభ్యాసం కరోనా మహమ్మారి వల్ల దెబ్బతింటుందని యునెస్కో చెబుతోంది. వీరు ఆన్​లైన్ మాధ్యమం ద్వారా విద్యనభ్యసించే అవకాశం ఉంది. కానీ అందులో ఎంత మంది నిజంగా నేర్చుకుంటున్నారనేది తెలియదు.

ఒకవేళ విద్యార్థులు పాఠశాల నుంచి బయటకు వెళ్తే వారు నేర్చుకోవడం కష్టం. 'వార్షిక విద్యా స్థితి నివేదిక'(ఏఎస్​ఈఆర్) సహా భారత ప్రభుత్వం విడుదల చేసే నేషనల్ అచీవ్​మెంట్ సర్వేలోనూ ఇదే విషయం వెల్లడైంది.

కరోనాకు ముందే పిల్లల అభ్యాసం సరిగా జరగలేదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విద్యావ్యవస్థ దెబ్బతింది. భారత్​లో 32.2 కోట్ల మంది చిన్నారుల అభ్యాసం సంక్షోభంలో ఉంది. ఇక పాఠశాలల్లోకి ప్రవేశించని విద్యార్థులపై ప్రభావం ఎలా ఉంటుందో ఊహించుకోండి. వలస కార్మికుల పిల్లల పరిస్థితి, బాలికల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి.

ఈ 20 శాతం డ్రాప్​ అవుట్ రేటు భారతదేశానిదా లేదా ప్రపంచం మొత్తానికి వర్తిస్తుందా?

సాధారణంగా సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డ తర్వాత పాఠశాలల నుంచి పిల్లలు వైదొలిగే సగటు డ్రాప్​ అవుట్ రేటు ఇది. ప్రస్తుతానికైతే ఎలాంటి అంచనాలు లేవు. పాఠశాలలు, అంగన్వాడీలు పునఃప్రారంభం కాలేదు కాబట్టి ఎంత మంది చిన్నారులపై ప్రభావం పడుతుందనే పరిశోధనలు జరగడం లేదు.

వీధి బాలలంతా ఇప్పుడు ఎక్కడున్నారో తెలియడం లేదు. ఆకస్మికంగా అందరూ అదృశ్యమయ్యారు. వారి విద్యాభ్యాసం పరిస్థితి ఏంటో తెలియదు.

పట్టణాల్లోని చాలా వరకు మధ్య తరగతి కుటుంబాల పిల్లలు ఆన్​లైన్ విద్యకు మారారు. ఈ విధానం పనిచేస్తోందా?

పిల్లలు ఇదివరకు దూర మాధ్యమం ద్వారా నేర్చుకోలేదు. ఈ విధానం గురించి ఇప్పుడే తెలుసుకొని సర్దుబాటు అవుతున్నారు. ఉపాధ్యాయులు సైతం ఆన్​లైన్​లో విద్యా బోధన చేయడానికి సిద్ధపడలేదు.

ఈ విధానం ద్వారా పిల్లలు విపరీతమైన ఒత్తిడికి గురవుతారు. సాధారణంగా విద్యార్థులు బహిరంగ ప్రదేశాల్లో, ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు. కానీ చుట్టూ స్నేహితులు, ఉపాధ్యాయులు ఎవరూ లేకుండా చిన్న గదికి పరిమితం అయిపోయినప్పుడు విద్యాభ్యాసం ఏమాత్రం అనుకూలంగా ఉండదు. సందేహాలను నేరుగా అడగలేరు.

ఈ నాలుగు నెలలు వృథా అయినట్లేనా? మీ అంచనాలేంటి?

ఈ విషయంలో ఎలాంటి మదింపు చేయలేదు కాబట్టి అసలు విద్యాభ్యాసం జరగట్లేదని చెప్పడం చాలా కష్టం. కానీ కచ్చితంగా అంతరాయం ఏర్పడింది.

ఆన్​లైన్ విద్యాభ్యాసం అనేది డిజిటల్ అంతరాలను వేలెత్తి చూపుతోందా? ప్రస్తుతం భారత్​లోని గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది?

విద్యనందించేందుకు తక్కువ వ్యయంతో కూడిన ప్రత్యామ్నాయాలను పరిశీలించాలి. మొబైల్ గ్రంథాలయాలు, కమ్యూనిటీ రేడియో వ్యవస్థను ఉపయోగించుకోవాలని సేవ్​ ద చిల్డ్రన్ చెబుతోంది. పిల్లలతో చేయించగలిగే విధంగా తల్లితండ్రుల కోసం మేం కొన్ని కార్యక్రమాలు రూపొందించాం.

విద్య అనేది ఇప్పుడు చిన్న విషయమే. చాలా కుటుంబాలకు ఇతర విషయాల్లోనూ కొరత ఉంది. కాబట్టి అభ్యాసాన్ని కొనసాగించడం అతిపెద్ద సవాలు.

మధ్యాహ్న భోజన కార్యక్రమాల పరిస్థితి ఏంటి?

అంగన్వాడీ కార్యకర్తలను చూసుకుంటే.. వీరంతా ఇంట్లోనే చిన్నారులకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. వండిన భోజనం మాత్రం అందించలేకపోతున్నారు. మేం పరిశీలించిన ప్రతి చోట ఇదే జరుగుతోంది.

కరోనా సమయంలో పరీక్షలు నిర్వహణపై మీ అభిప్రాయాలేంటి?

పాఠశాలలు, పరీక్షా కేంద్రాల నుంచి పిల్లలు సురక్షితంగా తిరిగిరావాలని మేం చెబుతున్నాం. ఆ స్థాయిలో పరిశుభ్రత, భద్రతను అందించగలిగితే వాటి గురించి ఆలోచించాలి. భౌతిక దూరం ఎలా సాధ్యమవుతుందో తెలియడం లేదు. కాబట్టి పరీక్షలు నిర్వహించడం చాలా కష్టం.

పరీక్షలు ఒక్కటే సమస్య కాదు. పిల్లలతో పాటు ఉపాధ్యాయులు సైతం విపరీతమైన ఒత్తిడికి గురవుతారు. పరిస్థితి సురక్షితంగా మారే వరకు పిల్లలను ఈ కేంద్రాలకు దూరంగా ఉంచాలి.

పాఠశాలలను తెరవాలా వద్దా?

సేవ్​ ద చిల్డ్రన్​లో భాగంగా చిన్నారులు పాఠశాలల నుంచి సురక్షితంగా తిరిగి రావడంపై మేం ప్రచారం చేస్తున్నాం. పరిస్థితి సురక్షితంగా మారి, మన నియంత్రణలోకి వచ్చే వరకు పిల్లలను పాఠశాలలకు పంపించకూడదు.

కొన్ని పాఠశాలలను ఐసోలేషన్ సెంటర్లుగా ఉపయోగించారు. కాబట్టి వాటిని క్రిమిరహితం చేయాలి. పాఠశాలలను పునఃప్రారంభించే ముందు ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంది.

కొవిడ్ అనంతర పరిస్థితుల్లో విద్యా రంగాన్ని పునరుద్ధరించడానికి ఏ స్థాయిలో నిధులు అవసరం?

నిధుల విషయంలో 12 శాతం క్షీణత ఉంటుందని తాజా యునెస్కో నివేదిక వెల్లడించింది. ఇప్పటికే ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న మనల్ని కరోనా మరింత అధ్వాన స్థితికి తీసుకొచ్చింది. ఇప్పుడు చేయాల్సిన పని చాలా పెరిగింది. జీవనోపాధి, వైద్య సేవలకు నిధులు వెచ్చించడం చాలా ముఖ్యం. అయితే భవిష్యత్తులో సంక్షోభం ఏర్పడకుండా జాగ్రత్తపడాలంటే వీటితో పాటు విద్యా రంగంపైనా పెట్టుబడి పెట్టాలి.

ఇదీ చదవండి- కరోనాతో కుదేలైన విద్యా వ్యవస్థ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.