ETV Bharat / bharat

జీ-7 సదస్సు: ప్లాస్టిక్​ భూతంపై మోదీ ప్రసంగం

జీ-7 సదస్సులో ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోదీ పర్యావరణ పరిరక్షణకు భారత్ చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. పునర్వినియోగానికి పనికిరాని ప్లాస్టిక్‌ను భారతావని నుంచి తొలగించేందుకు తీసుకోనున్న చర్యలను పేర్కొన్నారు.

జీ-7 సదస్సు: ప్లాస్టిక్​ భూతంపై మోదీ ప్రసంగం
author img

By

Published : Aug 27, 2019, 5:30 AM IST

Updated : Sep 28, 2019, 10:12 AM IST

జీ-7 సదస్సు: ప్లాస్టిక్​ భూతంపై మోదీ ప్రసంగం

ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్​ మెక్రాన్​ ఆహ్వానం మేరకు జీ-7 సమావేశాలకు ప్రత్యేక అతిథిగా వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. ముఖ్యంగా పునర్వినియోగానికి పనికారని ప్లాస్టిక్​ను భారత్​ నుంచి తొలగించేందుకు చేపడుతున్న చర్యలను వివరించినట్లు భారత విదేశీ మంత్రిత్వశాఖ ప్రతినిధి రవీశ్​ కుమార్​ ట్వీట్​ చేశారు.

రవీస్​ కుమార్​ ట్వీట్
రవీస్​ కుమార్​ ట్వీట్

నీటి సంరక్షణ, సౌరశక్తి వినియోగం, వృక్ష- జంతు సంపద కాపాడుకునేందుకు అనుసరిస్తోన్న విధానాలను జీ-7 సదస్సులో మోదీ వినిపించినట్లు రవీస్​ పేర్కొన్నారు.

యునెస్కోలో..

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో ఆగస్టు 23న నిర్వహించిన కార్యక్రమంలో వాతావరణ మార్పులపై భారత సంతతి ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. వాతావరణ మార్పులపై కాన్ఫరెన్స్​ ఆఫ్​ ది పార్టీస్​ (సీఓపీ-21) 2030కి నిర్దేశించిన లక్ష్యాలను రాబోయే ఏడాది లేదా ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని తెలిపారు.

New Delhi, Aug 26 (ANI): Peoples Democratic Party (PDP) leader Haji Anayat Ali joined Bharatiya Janata Party (BJP) on August 26 in Delhi. He joined BJP in the presence of Union Ministers Dharmendra Pradhan and Gajendra Singh Shekhawat. Ladakh MP Jamyang Tsering Namgyal was also present.
Last Updated : Sep 28, 2019, 10:12 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.