'భేటీ బచావో భేటీ పడావో' నినాదాన్ని బలోపేతం చేసే దిశగా విద్యార్థినులకు స్కూటీలను పంపిణీ చేసింది అసోం ప్రభుత్వం. 'డా.బాణీకాంత్ కాకతి అవార్డు'లో పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్లో ఫస్ట్ క్లాస్ వచ్చిన 22వేల మంది విద్యార్థినులకు స్కూటీలను అందించాలని సంకల్పించింది. శనివారం ఒక్కరోజే తొమ్మిది జిల్లాలకు చెందిన 5,452 మంది బాలికలకు స్కూటీలను పంపిణీ చేశారు అసోం విద్యాశాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ.
దేశంలోనే ఐదో స్థానం..
'డా.బాణీకాంత్ కాక్తీ అవార్డు' పథకానికి ప్రభుత్వం రూ.33కోట్లను కేటాయించిందని హిమంత బిశ్వ శర్మ తెలిపారు. కేవలం విద్య, వైద్యం కోసమే అసోం ప్రభుత్వం రాష్ట్ర జీడీపీలో 6శాతం ఖర్చు చేస్తోందని వెల్లడించారు. రాష్ట్రంలో అక్ష్యరాస్యత 85.9శాతంగా ఉందన్నారు. అక్ష్యరాస్యతలో దేశంలోనే ఆరో స్థానంలో అసోం ఉందని తెలిపారు.
అసోం ఇంటర్ ఫలితాలు 2020 జూన్ 25న వెలువడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,68,367మంది విద్యార్థినులు పరీక్షలకు హాజరు కాగా 78.28శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 481/500 మార్కులతో 2020 టాపర్లుగా పుబాలి దేఖా, శ్రద్థా బోగోహెయిన్లు నిలిచారు. ఇంటర్లో ఫస్ట్ క్లాస్ సాధించిన ప్రతి విద్యార్థినికి స్కూటీని అందిస్తామని అసోం ప్రభుత్వం గతంలో ప్రకటించింది.
ఇదీ చదవండి : ఒక్కో చెరుకు గడ 20 అడుగుల ఎత్తు- సీక్రెట్ ఇదే