భారీ వర్షాల కారణంగా అసోంలో వరద ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 25కు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 83,168 హెక్టార్ల పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. అసోంలోని మొత్తం 33 జిల్లాలకు గానూ 25 జిల్లాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది. మొత్తం 13.2 లక్షల మంది ప్రజలు వరద ప్రభావానికి గురయ్యారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.
రాష్ట్రంలో బర్‌పేట ప్రాంతానికి వరద ఉద్ధృతి వల్ల ప్రముఖ కజిరంగా, ఓరంగ్ జాతీయ ఉద్యానవనాలతో సహా పోబిటోరా వన్యప్రాణ సంరక్షణ కేంద్రం నీట మునిగింది. రాష్ట్రవ్యాప్తంగా 265 నిర్వాసిత శిబిరాలు ఏర్పాటు చేయగా... 25,461 మంది ఆశ్రయం పొందుతున్నారు. గువహటి, జోర్‌హట్, తేజ్‌పూర్, గోల్‌పారా, దుబ్రీ దగ్గర బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. ప్రవాహాల ధాటికి పలుచోట్ల రోడ్లు, వంతెనలు, కల్వర్టులు, తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఇదీ చూడండి: పాక్ కుట్ర భగ్నం- ముగ్గురు ఖలిస్థాన్ ఉగ్రవాదులు అరెస్టు