ETV Bharat / bharat

జల దిగ్బంధంలో 21 జిల్లాలు- మరో వ్యక్తి మృతి - Assam flood updates

అసోంలోని 21జిల్లాల్లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటివరకు 104 మంది మరణించారు. 19.82 లక్షలమంది ప్రభావితమయ్యారు. లక్షల ఎకరాల్లో పంట నీట మునిగిపోయింది.

Assam flood: One more dies, 20 lakh people remain affected
21 జిల్లాలు జల దిగ్బంధం.. మరో వ్యక్తి మృతి
author img

By

Published : Jul 29, 2020, 1:16 PM IST

వరదల ధాటికి అసోం అతలాకుతలమవుతోంది. 21 జిల్లాల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. 60 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలో 1771 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. 19,81,801 మంది ప్రభావితమయ్యారు. మరో వ్యక్తి మరణించగా.. మృతుల సంఖ్య 104కు ఎగబాకింది.

ప్రస్తుతం మరిగావ్​, గోల్​పారా, బార్పేట, ధెమాజీ జిల్లాల్లో వరద ఉద్ధృతి ఎక్కువగా ఉంది. అసోంలో ఇప్పటివరకు 1,03,609,71 హెక్టార్ల పంట నీట మునిగిపోయింది. గోల్​పారా, దర్రాంగ్​ జిల్లాల్లో పంట నష్టం ఎక్కువగా ఉంది.

21 జిల్లాలు జల దిగ్బంధం.. మరో వ్యక్తి మృతి
Assam flood: One more dies, 20 lakh people remain affected
జల దిగ్బంధంలో అసోం

బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దీని వల్ల నదీ పరివాహక ప్రాంతాలు కోతకు గురవుతున్నాయి. ఫలితంగా కాజీరంగా, మానస్​, ఆర్​జీ ఆరెంజ్​ జాతీయ పార్కులు, పాబితోరా, బుర్హాసపోరి వన్య ప్రాణి సంరక్షణ కేంద్రాల్లో భారీగా వరద నీరు ప్రవేశించింది. ఆహారం లభించకపోవడం వల్ల మూగ జీవులు విలవిల్లాడిపోతున్నాయి.

నివాస ప్రాంతాల్లో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు

నిలువ నీడ లేక దీనంగా ఉన్న పశువులు

ఇదీ చూడండి: భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.