ETV Bharat / bharat

అసోంలో ఆగని వరద ఉద్ధృతి.. 105కు చేరిన మృతులు - అసోం వరదల ధాటికి 105 మంది మృతి

అసోంలోని 26 జిల్లాలు వరదలకు అతలాకుతలమవుతున్నాయి. ఫలితంగా 27.64 లక్షల మంది ప్రభావితమయ్యారు. 2,700 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మొత్తం 47వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 105 మంది మృతి చెందారు.

assam flood visual
అసోంలో వరదల ధాటికి 105 మంది మృతి
author img

By

Published : Jul 19, 2020, 2:06 PM IST

అసోంలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. మొత్తం 26 జిల్లాల్లో వరద ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. 27.64 లక్షల మందిపై ప్రభావం పడింది. పలు ప్రాంతాల్లో రహదారులు, ఇళ్లు, వంతెనలు నేలమట్టమయ్యాయి.

అసోంలో వరదలు
assam flood visual
పూర్తిగా మునిగిన ఇళ్లు
assam flood visual
ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న వరద

తాజాగా మరో ఇద్దరు మృతి చెందగా... రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 105కు చేరింది. వీరిలో కొండచరియలు విరిగి పడి మృతి చెందిన వారు కూడా ఉన్నారు. ఈ వరదల కారణంగా కజీరంగా జాతీయ పార్క్​లో 90 మూగ జీవాలు మృతి చెందాయి.

assam flood visual
నీట మునిగిన ఇళ్లు
  • జల దిగ్బంధంలో మొత్తం 2,678 గ్రామాలు
  • నీట మునిగిన 1,16,404 హెక్టార్ల పంట భూమి
  • 21జిల్లాల్లో 649 శిబిరాల ఏర్పాటు
  • 47,465 మందిని సురక్షిత కేంద్రాలకు తరలింపు
    assam flood visual
    వరద నీటిలో ఖడ్గ మృగాలు

శనివారం ధుబ్రి జిల్లాలో మరో 511 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు.

assam flood visual
వరద నీటిలో ఏనుగులు

శిబిరాల్లో ఉన్న ప్రజలకు నిత్యావసర వస్తువులు, మాస్క్​లు, చిన్న పిల్లలకు కావాల్సిన పాలు, ఇతర సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు.

ఇదీ చూడండి:వరద బీభత్సం.. కొట్టుకుపోయిన ఇల్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.