అసోంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 24కు చేరింది. 25 జిల్లాల్లో 13.17 లక్షల మంది తీవ్రంగా ప్రభావితమయ్యారు.
అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్లో కురుస్తోన్న వర్షాలకు బ్రహ్మపుత్ర నది ప్రమాదస్థాయిలో ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
" రాష్ట్రవ్యాప్తంగా 2,404 గ్రామాల్లో 13.17 మంది ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. 83,168 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. 273 సహాయక శిబిరాల్లో 27,452 మంది ఆశ్రయం పొందుతున్నారు."
- రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం
వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు జాతీయ విపత్తు స్పందన దళం, అసోం రాష్ట్ర విపత్తు స్పందన దళం, స్థానిక అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రభావిత ప్రాంతాలకు అవసరమైన ఆహార పదార్థాలు, నిత్యావసరాలను అందిస్తున్నారు.
ఇదీ చూడండి: 'పెట్టుబడుల పేరుతో 'చైనా దొంగాట'పై దర్యాప్తు!'