ETV Bharat / bharat

వరద బీభత్సం.. అసోం, బిహార్​పై తీవ్ర ప్రభావం - assam flood effected people

ఉత్తరాది రాష్ట్రాల్లో వరదల బీభత్సం కొనసాగుతోంది. రాష్ట్రంలో 28.32లక్షల మంది వరదల కారణంగా ప్రభావితమయ్యారు. బిహార్​లోనూ 7.65 లక్షలమంది వరదల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

flood
వరదల బీభత్సం
author img

By

Published : Jul 24, 2020, 5:05 AM IST

అసోంలో వరదల కారణంగా జన జీవనం అస్తవ్యస్తమైంది. వివిధ ప్రాంతాల్లో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 33 జిల్లాలకు గానూ 26 జిల్లాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. 28.32లక్షల మంది తీవ్రంగా ప్రభావితమయ్యారు.

flood
అసోంలో కొనసాగుతున్న వరదల బీభత్సం
flood
అసోంలో కొనసాగుతున్న వరదల బీభత్సం

పరిస్థితిని సమీక్షించేందుకు అసోం గవర్నర్​ జగదీశ్​ ముఖి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్​ సర్వే నిర్వహించారు. ముంపు ప్రాంతాల ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలని కేంద్రాన్ని కోరనున్నట్టు వెల్లడించారు. అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్​ కూడా వరదల కారణంగా నీట మునిగిన రెండు జిల్లాలను సందర్శించారు.

flood
అసోంలో కొనసాగుతున్న వరదల బీభత్సం

అసోం వరదల్లో ఇప్పటివరకు 93మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 26మంది కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో చనిపోయారు. 1.19లక్షల హెక్టార్ల పంటనష్టం సంభవించింది.

బిహార్​లో..

బిహార్​లో వరదల ఉద్ధృతి మరింత తీవ్రమైంది. 10 జిల్లాల్లోని 7.65లక్షల మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు పేర్కొన్నారు.

flood
బిహార్​లో

వరదల కారణంగా నిరాశ్రయులైన వారికి రూ.6వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని బిహార్​ ప్రభుత్వం ప్రకటించింది.

flood
బిహార్​లో

ఇదీ చూడండి: 'రామాలయ భూమిపూజ ముహూర్తం సరైంది కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.