కర్ణాటక హాసన్ జిల్లాలో ఓ యువతి పెయింటింగ్‌లో అద్భుత ప్రతిభను కనబరుస్తోంది. ఒక చేత్తో బొమ్మలను గీస్తే అందులో పెద్ద ఆశ్చర్యమేమీ ఉండకపోవచ్చు. అయితే.. ఏకకాలంలోనే రెండు చేతులతో ఒకే విధంగా తన కళను చాటుకుంటోంది మేఘన. ప్రస్తుతం ఫార్మసీ విద్యనభ్యసిస్తోన్న ఆమె.. ఇటీవలే ఓ అద్భుతమైన పెయింటింగ్‌ను కేవలం 50సెకన్ల నిడివిలో పూర్తి చేసి రికార్డ్ నెలకొల్పింది. మేఘన ప్రతిభకు మెచ్చి.. 'ఆసియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్', 'ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్' వరించాయి.


కుటుంబ సభ్యుల నుంచి ప్రముఖుల వరకు
పిన్న వయసులోనే పెయింటింగ్‌పై అవగాహన కల్పించుకున్న మేఘన.. పెన్సిల్ ఆర్ట్‌లోనూ చక్కగా రాణిస్తూ సవ్యసాచిగా మారింది. తన కుటుంబ సభ్యులు, మిత్రులు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సహా ప్రముఖ గాయకుల చిత్రాలను గీసింది ఆమె. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్, ప్రధాని నరేంద్ర మోదీ వంటి ప్రముఖుల పెయింటింగ్‌లను ఆకర్షణీయంగా గీసింది.


అంతేకాకుండా.. కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. ఇటీవలే ఓ చిత్రాన్ని గీసి లండన్‌లో పెయింటింగ్ కాంపిటీషన్స్‌కు పంపింది ఈ సవ్వసాచి.

ఇదీ చదవండి: రంగురంగుల పిన్నులతో దుర్గామాత చిత్రపటం