భారత్‌లో సుమారు 36 గంటల సుదీర్ఘ పర్యటన తర్వాత డొనాల్డ్ ట్రంప్ అమెరికా బయలుదేరారు. ఈ నేపథ్యంలో భారతదేశానికి వచ్చినందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులకు ధన్యవాదాలు తెలిపారు ప్రధాని మోదీ.
ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు మంచి పునాది పడిందని మోదీ అన్నారు. ఈ పర్యటనను ఒక మైలురాయిగా అభివర్ణించారు. భారత్-అమెరికా స్నేహగీతిక రెండు దేశాలు ప్రజలకు లాభదాయకమని మోదీ ట్వీట్ చేశారు.
సంతోషంగా ఉంది!
ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, అల్లుడు జారెడ్ కుష్నర్ భారత్‌ను పర్యటించినందుకు చాలా సంతోషంగా ఉందని మరో ట్వీట్ చేశారు మోదీ. 'భారతదేశం పట్ల మీరు ఎంతో ఆప్యాయత చూపించారు. మహిళల్లో మరింత సాధికారత సాధించాలి. మీకు నా ఆశీస్సులు. మళ్లీ మీరు భారత్‌ను సందర్శించాలని ఆశిస్తున్నానని' మోదీ ఈ ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి: దిల్లీ 'పౌర' ఘర్షణలపై రేపు సుప్రీంలో విచారణ