ETV Bharat / bharat

బిహార్​ పోరులో దళిత ఓటరు ఎటువైపు? - బిహార్​ ఎన్నికలు

బిహార్​లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో దళితులు కీలకంగా మారనున్నారు. మెజార్టీ స్థానాల్లో గెలుపోటములను నిర్ణయించునున్నారు. ఈ నేపథ్యంలో బిహార్​లో అన్ని పార్టీల నేతలు వారిని ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు.

Dalit Politics on the boom in Bihar
బిహార్​ పోరులో దళిత ఓటరు ఎటువైపు?
author img

By

Published : Sep 10, 2020, 5:52 PM IST

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో బిహార్​లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. 243 అసెంబ్లీ స్థానాల్లో 16శాతం ఓటు బ్యాంకు ఉన్న దళితులు కీలకంగా మారిన నేపథ్యంంలో వారిని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు ప్రధాన పార్టీల నేతలు.

కొంతకాలంగా దళితుల ఓట్లను ఏకఛత్రాధిపత్యంగా రాబట్టుకుంటున్న రామ్​ విలాస్​ పాసవాన్​ను ఢీకొట్టేందుకు జితన్ రామ్ మాంఝీ లాంటి బలమైన నాయకులను భాజపా, జేడీయూ మరోమారు తెరపైకి తెస్తున్నాయి. వారి ద్వారా దళితుల ఓట్లపై పట్టు సాధించాలనే ఆలోచనలో ప్రధాన పార్టీలు ఉన్నట్లు తెలుస్తోంది.

రిజర్వుడు​ స్థానాలు 40

బిహార్‌లో 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అందులో 40 సీట్లు ఎస్సీ రిజర్వుడు. రాష్టంలో దళితుల ఓట్లు 16శాతం. అంటే రిజర్వుడు​ స్థానాల్లో కాకుండా మిగతా చోట్ల కూడా వారు కీలకంగా మారనున్నారు. ఎన్నికల సమయంలో అందుకే ఇక్కడ దళితుల సమస్యలు ప్రధానంగా చర్చకు వస్తాయి.

మహాదళిత్​ అంశం..

బిహార్​లో బలమైన దళిత నాయకుడు రామ్ విలాస్ పాసవాన్. సొంత వర్గం ఓటర్ల అండతోనే ఆయన​ జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు, ఎంపీ చిరాగ్​ పాసవాన్​ సైతం దళిత కార్డుతోనే రాజకీయంగా ఎదుగుతున్నారు.

బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న దళితులను జేడీయూ వైపు ఆకర్షించేందుకు 2005లో నితీశ్​ కుమార్ సీఎం అయ్యాక ఆ వర్గాన్ని విభజించారు. 22 కులాల్లో 21 కులస్థులను మహాదళితులుగా వర్గీకరించారు. 2018లో మిగిలిన పాసవాన్​ కులాన్ని సైతం మహదళిత్‌గా ప్రకటించారు. దీంతో ఇక బిహార్​లో దళిత సమాజం లేదని నితీశ్​ చాటిచెప్పారు.

అయినప్పటికీ రామ్ విలాస్ పాసవాన్​ నేటికీ గుత్తాధిపత్యాన్ని కలిగి ఉన్నారు. 22 దళిత కులాల్లో రవిదాస్, ముసహార్, పాసవాన్​ కులాలు ఎల్​జేపీకి పెట్టని కోటలు.

జితన్​ రామ్​ మాంఝీ

గత ఎన్నికల్లో దళితుల ఓట్లను రాబట్టేందుకు అప్పటి వరకు మంత్రిగా ఉన్న జితన్​ రామ్​ మాంఝీని నితీశ్​కుమార్ ముఖ్యమంత్రిని చేశారు. దాదాపు ఎనిమిది నెలలు పాటు మాంఝీ సీఎంగా పనిచేశారు. ఆయనకు దళిత వర్గాల్లో మంచి పట్టుంది. ఈ సానుభూతిని నితీశ్​ వాడుకోవాలనుకున్నారు. ​ఎనిమిది నెలల తర్వాత మాంఝీని నితీశ్​.. సీఎం పదవి నుంచి తప్పించారు. దీంతో మాంఝీ తిరుగుబాటు చేసి.. కొత్త పార్టీ పెట్టారు. ఇప్పుడు మరోమారు ఎన్​డీఏ వైపు అడుగులు వేశారు.

ముఖ్యమంత్రి తేజస్వీనే : ఆర్జేడీ

ప్రతిపక్ష రాష్ట్రీయ జనతా దళ్​ మాత్రం నితీశ్​ కుమార్ దళితుల కోసం ఏమీ చేయలేదని పదేపదే విమర్శిస్తోంది. ఎన్నికల్లో దళితులు, వెనుకబడిన కులాల్లో ఎక్కువ భాగం, మైనారిటీలు లాలూ ప్రసాద్‌తోనే ఉండబోతున్నారని, తేజస్వీ యాదవ్​ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆర్జేడీ మద్దతుదారులు అంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.