రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. మహారాష్ట్రలో పోటీ చేసిన 24 స్థానాలు, హరియాణాలో పోటీ చేసిన 46 స్థానాలు మొత్తం 70 అసెంబ్లీ సీట్లలోనూ ఆ పార్టీ అభ్యర్థలు ఓటమి చవిచూశారు.
నోటా కంటే తక్కువ..
రెండు రాష్ట్రాల్లోనూ నోటా కంటే తక్కువ ఓట్లు ఆ పార్టీకి రావడం గమనార్హం. హరియాణాలో ఆ పార్టీకి 0.48 శాతం ఓట్లు రాగా.. నోటాకు 0.53 శాతం ఓట్లు పోలయ్యాయి. మహారాష్ట్రలో నోటాకు 1.37 శాతం ఓట్లు రాగా.. ఆప్‌కు కేవలం 0.11 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. చీపురు గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థుల్లో చాలా మందికి వెయ్యి ఓట్లు కూడా రాకపోవడం గమనార్హం.
ఇదీ చూడండి: పార్టీ ఎమ్మెల్యేలతో హరియాణా కింగ్ మేకర్ కీలక భేటీ!