జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ అంశాన్ని అవసరమైతే ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్తామని సుప్రీం వ్యాఖ్యానించింది.
ఇదే అంశంపై గతంలో సుప్రీంకోర్టు వేరువేరు సందర్భాల్లో ఇచ్చిన తీర్పులు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని చూపించగలిగితేనే విస్తృత ధర్మాసనానికి పంపించే విషయాన్ని పరిశీలిస్తామని పేర్కొంది.
1959, 1970ల్లో ఐదుగురు సభ్యుల ధర్మాసనం 370 అధికరణంపై తీర్పులు వెలువరించాయి. ఈ రెండు తీర్పులు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని నిరూపించినప్పుడు మాత్రమే.. 370 సమస్యను ఏడుగురు సభ్యుల ధర్మాసనం పరిశీలనకు వెళ్తుందని పేర్కొంది.
ఈ అధికరణం రద్దుపై ప్రస్తుతం దాఖలైన వ్యాజ్యాలను జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారిస్తోంది.
- ఇదీ చూడండి: ప్రజాస్వామ్య సూచీలో మరింత దిగువకు భారత్