ETV Bharat / state

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షపై యూటర్న్‌ - మూడుసార్లు కాదు రెండుసార్లు మాత్రమే ఛాన్స్ - JEE ADVANCED EXAM UPDATE

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్ణయంలో యూ టర్న్‌ - గతంలో మాదిరిగానే రెండుసార్లు మాత్రమే అవకాశం - ప్రకటించిన ఐఐటీ కాన్పూర్

JEE Advanced Exams Only Twice In a Year
JEE Advanced Exams Only Twice In a Year (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 19, 2024, 10:15 AM IST

JEE Advanced Exams Only Twice In a Year : జేఈఈ అడ్వాన్స్‌డ్ -2025 నుంచి మూడుసార్లు రాసుకోవచ్చని ఇటీవల ప్రకటించిన నిర్ణయంపై జాయింట్ అడ్మిషన్ బోర్డు యూ టర్న్‌ తీసుకుంది. ఐఐటీల్లో బీటెక్‌, బీఆర్క్‌ సీట్ల భర్తీకి నిర్వహించే ఈ పరీక్షకు గతంలో మాదిరిగానే వరుసగా రెండుసార్లు మాత్రమే అనుమతి ఉంటుందని ఈ నెల 15న జరిగిన జేఏబీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఐఐటీ కాన్పూర్ ప్రకటించింది.

ఐఐటీల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశానికి 2013 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ పేరిట పరీక్ష నిర్వహిస్తున్నారు. దానికి ఇంటర్‌ పాసైన సంవత్సరంతో పాటు ఆ తర్వాత ఏడాది అంటే వరుసగా రెండుసార్లు మాత్రమే పరీక్షకు హాజరు కావొచ్చు. దాన్ని మూడుసార్లకు పెంచుతూ జేఈఈ అడ్వాన్స్‌డ్ నిర్వహణ బాధ్యత తీసుకున్న ఐఐటీ కాన్పూర్‌ ఈ నెల 5న తెలిపింది. పట్టుమని 15 రోజులు కాకముందే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. దీంతో గతంలో మాదిరిగానే రెండుసార్లు మాత్రమే ఈ పరీక్షను రాయాలి. వచ్చే మే నెలలో జరిగే అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు 2024 మార్చి, 2025 మార్చి, 2025 మార్చిలో జరిగే ఇంటర్‌ లేదా సమానమైన పరీక్షల్లో పాసైన వారు మాత్రమే ఈ పరీక్షకు అర్హులు. అంతకంటే ముందు ఇంటర్‌ పూర్తి చేసిన వారికి అవకాశం ఉండదు.

జేఈఈ పరీక్ష రాస్తున్నారా? - ఐతే ఈ లేటెస్ట్ అప్డేట్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే

ఒలింపియాడ్‌లో పాల్గొంటే ఐఐటీ కాన్పుర్‌లో సీట్లు : అంతర్జాతీయ ఒలింపియాడ్‌లో పాల్గొన్న విద్యార్థులకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌తో సంబంధం లేకుండా ఐఐటీ కాన్పూర్‌లో బీటెక్, బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ (బీఎస్‌) సీట్లు ఇస్తామని ఆ సంస్థ స్పషం చేసింది. గణితం, ఇన్‌ఫర్మేటిక్స్‌ ఒలింపియాడ్‌లో పాల్గొన్న వారికి సీఎస్‌ఈలో ఆరు సీట్లు కేటాయిస్తామని ప్రకటించింది. ఎకనామిక్స్‌ సైన్సెస్, మేథమెటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్, కెమిస్ట్రీ, బయలాజికల్‌ సైన్సెస్‌ అండ్‌ బయో ఇంజినీరింగ్‌ విభాగాల్లోనూ సీట్లు కేటాయిస్తామని వెల్లడించింది.

ఈ సీట్లకు మార్చి మొదటి వారంలో దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. జోసా కౌన్సెలింగ్‌ కంటే ముందుగానే ఈ సీట్లను భర్తీ చేస్తారు. ఇప్పటికే ఉన్న సీట్ల నుంచే ఒలింపియాడ్‌ విద్యార్థులకు కేటాయిస్తారా? సూపర్‌ న్యూమరరీ కింద అదనపు సీట్లు మంజూరు చేస్తారా? అనే విషయం తెలవాల్సి ఉంది.

ఇకపై ఆప్షనల్ క్వశ్చన్స్ ఉండవ్- JEE మెయిన్‌ ఎగ్జామ్​లో బిగ్ ఛేంజ్​!

జేఈఈ, నీట్​ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? - మీ కోసమే ఫ్రీ కోచింగ్ - ఎక్కడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.