భారత్- చైనా సరిహద్దులో గస్తీకోసం ఇకపై రెండు మూపురాల ఒంటెలను ఉపయోగించనున్నారు సైనికులు. మూడేళ్ల క్రితమే వీటిని వినియోగించాలనే ప్రస్తావన రాగా.. తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంట నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రస్తుతం వీటిని ఉపయోగించాలని నిర్ణయించారు.
లద్దాఖ్‌లోని లేహ్ ప్రాంతంలో 17వేల అడుగుల ఎత్తులో 170 కిలోల బరువు మోయగల రెండు మూపురాల(బాక్ట్రియన్) ఒంటెలపై ఇప్పటికే పరిశోధనలు నిర్వహించింది రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ). ఒక మూపురం ఒంటెలకన్నా.. ఇవి ఎక్కువ కాలం నీరు, ఆహారం లేకుండా ఉండగలవని పరిశోధనల్లో తేలింది.
ఇదీ చదవండి: హద్దు మీరితే కాల్పులే!- చైనాకు తేల్చి చెప్పిన భారత్